అన్వేషించండి

Amitabh- Rajinikanth: ‘వేట్టయాన్‌’ సెట్స్ లో సూపర్ స్టార్స్ హగ్- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పిక్స్

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వేట్టయాన్‌’. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా రజనీ, అమితాబ్ ప్రేమతో హగ్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Amitabh Bachchan- Rajinikanth Hugging: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ కాంబో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వేట్టయాన్‌’. ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్, ‘జై భీమ్’ మూవీతో సూపర్ సక్సెస్ సాధించిన జ్ఞానవేల్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ హీరో అమిత్ బచ్చన్, మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ యాక్టర్ రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్ లో 170వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది.   

ముంబై సెట్స్ లో రజనీ, అమితాబ్ ఆలింగనం

ప్రస్తుతం ‘వేట్టయాన్‌’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజా షెడ్యూల్ ముంబైలో కొనసాగిస్తున్నారు. ఈ షూటింగ్ లో అమితాబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరూ హగ్ చేసుకుంటూ కనిపించారు. బ్లాక్ బ్లేజర్లు ధరించి సూపర్ స్టార్స్ మరింత స్టైలిష్ గా ఉన్నారు. ఇద్దరు సీరియస్ గా చర్చించుకోవడంతో పాటు ఆలింగనం చేసుకున్నారు. చివరగా ఇద్దరూ ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మీ ఫోటోలే ఇలా ఉంటే, సినిమాలో ఇంకా ఏ రేంజిలో ఉంటారో? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

మూడు దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్న రజనీ, బిగ్ బీ   

సుమారు 3 దశాబ్దాల తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు ‘అందా కానూన్‌’, ‘గిరాఫ్తార్‌’, ‘హమ్‌’ సినిమాల్లోకనిపించారు. ఇప్పుడు ‘వేట్టయాన్’లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఏపీలోని కడప జిల్లాలోనూ కొద్ది రోజుల పాటు షూటింగ్ జరిపారు. ప్రొద్దుటూరు బస్టాండ్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. జమ్మలమడుగులోనూ కొంత షూటింగ్ కొనసాగించారు. ఆ తర్వాత ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న గ్రానైట్ క్వారీలో సినిమాను షూట్ చేశారు. రజనీకాంత్, ఫహాద్ ఫాజిల్, రితిక సింగ్, కృష్ణుడు మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ ఎస్ ఆర్ కతిర్ వ్యవహరిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ కొత్త సినిమా

ఓ వైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే, మరోవైపు, రజనీకాంత్‌ 171వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘కూలీ’ అనే పేరును మేకర్స్ ఫిక్స్ చేశారు. మాఫియా నేపథ్యంలో కొనసాగే యాక్షన్ చిత్రంగా ‘కూలీ’ రూపొందనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Read Also: రండి, చెన్నైలో జాన్వీ కపూర్ భవంతి ఫొటోలు చూద్దాం, ఇందులో మీరూ బస చేయొచ్చు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
PV Sindhu Match: పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Embed widget