News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Pawan Kalyan Birthday Special : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్

హిట్టూ ఫ్లాపులకు అతీతమైన హీరో పవన్ కళ్యాణ్. పరాజయాలు పలకరించినప్పుడూ ఆయన మార్కెట్ తగ్గలేదు. స్టార్‌డ‌మ్‌, క్రేజ్ పెరుగుతున్నాయి. బహుశా... ఇటువంటి ట్రెండ్ సెట్ చేసిన హీరో పవర్ స్టారే అనుకుంట!

FOLLOW US: 
Share:

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)... మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. మరి, ఇప్పుడు? ఆయనొక అగ్ర కథానాయకుడు. అభిమానులకు పవర్ స్టార్. చిరంజీవి తమ్ముడు నుంచి పవర్ స్టార్‌గా ఎదగడం వెనుక మెగా వారసత్వం ఒక్కటే లేదు. హీరోగా పవన్ కళ్యాణ్ పడిన కష్టం ఉంది. కథల ఎంపికలో చూపించిన వైవిధ్యం ఉంది.

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి 'భీమ్లా నాయక్' వరకూ పవన్ కళ్యాణ్ 27 సినిమాలు చేశారు. అందులో విజయాలు, అపజయాలూ ఉన్నాయి. అయితే... హిట్టూ ఫ్లాపులకు అతీతమైన హీరో పవన్ కళ్యాణ్. ఫ్లాప్‌లు వచ్చినప్పుడు ఆయన మార్కెట్ తగ్గలేదు. తర్వాత సినిమాకు పెరిగింది. హిట్ పడినప్పుడు మరింత పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే... పవన్ కళ్యాణ్ స్టార్‌డ‌మ్‌ ఫ్లాప్‌ల‌తో కట్టిన కోట. పవర్ స్టార్ కంటే ఆయన్ను ఎక్కువగా ప్రేక్షకులు ప్రేమించడం వెనుక సినిమాలు మాత్రమే లేవు. ఆయన సింప్లిసిటీ, పర్సనాలిటీ ఉన్నాయి. ప్రేక్షకుల ముందు ప్రత్యేకంగా నిలిపాయి. పవన్ ఎందుకు స్పెషల్ అంటే...

'గబ్బర్ సింగ్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది... 'నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా' అని! డైలాగ్ చెప్పడమే కాదు... సినిమాల్లోనూ పవన్ కళ్యాణ్ ట్రెండ్ చేశారు.

పవన్ కళ్యాణ్... ట్రెండ్ సెట్టర్!
పవన్ కళ్యాణ్ ఓ ట్రెండ్ సెట్టర్. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' విడుదలకు ముందు తెలుగునాట 'ఎవరీ అబ్బాయి?' అంటూ హోర్డింగ్‌లు, వాల్ పోస్టర్‌లు కనిపించాయి. ప్రజలలో ఆసక్తి కలిగింది. వారం తర్వాత 'ఇతడే మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కళ్యాణ్ బాబు' అని పోస్టర్లు వచ్చాయి. చిరంజీవి వారసుడిగా వెండితెరకు వచ్చినా... తొలి సినిమాతో తన ప్రత్యేకత చూపించారు పవన్ కళ్యాణ్. మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ చూపించారు. రియల్‌గా స్టంట్స్ చేశారు. ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమాలో మాత్రమే కాదు, ఆ తర్వాత సినిమాలు చూడండి. 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి', 'అత్తారింటికి దారేది'... చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ స్టంట్స్, యాక్షన్ సీన్స్ నయా ట్రెండ్ సెట్ చేశాయి.

పాటల్లోనూ ట్రెండ్ సెట్టరే!
ఫైట్స్ విషయంలో మాత్రమే కాదు... పాటలు, స్టయిల్ విషయంలోనూ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టరే. ప్రతి సినిమాలో పాటలు స్పెషల్‌గా ఉండేలా చూసుకోవడం పవన్ కళ్యాణ్ స్టయిల్. తెలుగు సినిమాల్లో హిందీ, ఇంగ్లీష్ పాటలు వినిపించిన క్రెడిట్ ఆయనదే.
 
తెలుగులో సినిమాలో హిందీ, ఇంగ్లీష్ పాటలు పెడితే ప్రేక్షకులు వింటారో? లేదో? అర్థం అవుతుందో? లేదో? అనే సందేహాలను పక్కన పెట్టి మరీ 'ఖుషి'లో 'యే మేరా జహా' సాంగ్ చేశారు. తెలుగు ప్రేక్షకులను ఆ పాట ఒక ఊపు ఊపేసింది. అంతకు ముందు 'తమ్ముడు'లో 'అయామ్ జస్ట్ ఎ ట్రావెలింగ్ సోల్జర్' కూడా అంతే! చాలా మందికి లిరిక్స్ అర్థం కాకపోయినా... ఈ పాటలు ప్రేక్షకుల్లోకి వెళ్లాయి. వాళ్ళు కొత్తగా ఫీలయ్యారు. పవన్‌కు ఫ్యాన్స్ అయ్యారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పవన్ సాంగ్స్ ఛార్ట్‌బ‌స్ట‌ర్లు అయ్యాయి. 

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన పరిచయ గీతాలు ప్రత్యేకంగా ఉంటాయి. కేవలం సినిమా గురించి మాత్రమే కాకుండా... అందులో ఏదో ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

పవన్ స్టయిల్ స‌మ్‌థింగ్‌ స్పెషల్
పవన్ కళ్యాణ్ డ్రస్సింగ్ స్టయిల్ స‌మ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉంటుంది. 'ఖుషి'లో హుడీస్ కావచ్చు... 'బాలు'లో ఫ్యాంట్స్‌ కావచ్చు... 'బద్రి'లో టక్ చేసిన విధానం కావచ్చు... డ్రస్సింగ్ పరంగా పవన్ కళ్యాణ్ డిఫరెన్స్ చూపించారు. తెలుగు స్క్రీన్ మీదకు కొత్త స్టయిల్స్ తీసుకొచ్చారు.

పాటలు, యాక్షన్ సీన్లు, స్టయిల్స్ విషయంలో తెలుగు ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలని పవన్ కళ్యాణ్ తపన పడ్డారు. 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'ఖుషి' వంటి కొత్త ప్రేమకథలు చేశారు. క్లాస్ కథల్లో మాస్ చూపించారు. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత 'జానీ' వంటి ప్రయోగం చేశారు. 'అత్తారింటికి దారేది' వంటి కుటుంబ కథా చిత్రం చేశారు. కథల ఎంపిక, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న తీరు ప‌వ‌న్‌ను ప్రేక్షకుల ముందు ప్రత్యేకంగా నిలిపింది. చిరు వారసుడిని కొత్త కథానాయకుడు చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే... పవన్ మేనరిజమ్స్ మరో ఎత్తు!

పవన్ మేనరిజం... ఓ ట్రేడ్ మార్క్!
పవన్ సినిమా అంటే ప్రేక్షకులకు ముందుకు గుర్తుకు వచ్చేది ఆయన ట్రేడ్ మార్క్ మేనరిజం. మెడ కింద చెయ్యి వేసి పవర్ స్టార్ ఇచ్చే లుక్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్ళలో ఒక పవర్ ఉందని అంటుంటారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు ఎంతో మంది భక్తులు, అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలు చూసి ఇష్టపడలేదు. వ్యక్తిత్వం చూశారు.

పవన్ వ్యక్తిత్వానికి అభిమానులే!
చిత్రసీమలో పవన్ కళ్యాణ్ ఎంతో మందికి సహాయం చేశాడని త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి అగ్ర దర్శకుడు చెప్పారు. దానగుణమే కాదు... పవర్ స్టార్‌లో మంచితనమూ ఉంది. వేరొక హీరో గురించి పవన్ చెడుగా మాట్లాడడం చూడలేదని హరీశ్ శంకర్ చెప్పారు. ఎవరైనా చెడుగా మాట్లాడాలని ప్రయత్నిస్తే... టాపిక్ కట్ చేస్తారని, పని గురించి మాత్రమే డిస్కస్ చేస్తారని ఆయన తెలిపారు. పవన్ గురించి మంచి చెప్పే వాళ్ళు ఉన్నారు. ఆయనను విమర్శించిన ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే... ప్రేక్షకులు ఆయనలో చూసిన గుణం ఒకటి ఉంది. విజయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా ప్రశాంతంగా ఉండటం! చాలా మందికి అది నచ్చింది. అందుకే, 'ఖుషి' తర్వాత కొన్నేళ్లు ఆ స్థాయి విజయాలు లేకపోయినా... పవన్ సినిమాలకు ఆదరణ తగ్గలేదు.

Also Read : ఒకవేళ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తే మహేశ్, రవితేజ, సూర్యకు స్టార్‌డ‌మ్‌ వచ్చేదా?

పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్లాప్ అయినా... పాటలో, పవన్ డ్రస్సులో, యాక్షన్ సన్నివేశాలో, ఆయన వ్యక్తిత్వమో, ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంది. యువతలో ఆయన క్రేజ్ పెంచాయి. ఓ తరం ప్రేక్షకులు పవన్ నామస్మరణ చేశారు. ఇప్పటికీ  చేస్తున్నారు. 'అత్తారింటికి దారేది' సినిమా సగం ఆన్‌లైన్‌లో లీకైన తర్వాత కూడా ఇండస్ట్రీ హిట్ అందుకోవడానికి కారణం అదే.

హరీశ్ శంకర్ మాటల్లో చెప్పాలంటే... తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, ఆయన స్థానం వేరు! జయాపజయాలకు, రాజకీయాలకు అతీతమైన కథానాయకుడు పవన్ కళ్యాణ్. ఎప్పటికీ పవర్ స్టార్ మేనియా శాశ్వతం.

Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... రీమేక్‌లందు పవన్ రీమేక్స్ వేరయా - పవర్ స్టార్‌ది సపరేట్ మేనియా

Published at : 02 Sep 2022 12:50 PM (IST) Tags: Pawan Kalyan Birthday Special Article Reasons For Pawan Craze Pawan Kalyan Speciality Pawan Kalyan Rare Qualities Pawan Kalyan Success Story

ఇవి కూడా చూడండి

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్

Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్

Animal: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!

Animal: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!

Suriya - Karthi: 'మిగ్‌జాం' తుఫాన్ బాధితులకు సూర్య, కార్తీ ఆర్థిక సాయం - మరి మన స్టార్స్?

Suriya - Karthi: 'మిగ్‌జాం' తుఫాన్ బాధితులకు సూర్య, కార్తీ ఆర్థిక సాయం  - మరి మన స్టార్స్?

Ram Gopal Varma: మీ ఇద్దరి షూస్ నాకాలని ఉంది - ‘యానిమల్’ దర్శకుడు, రణబీర్‌పై ఆర్జీవీ ప్రశంసలు

Ram Gopal Varma: మీ ఇద్దరి షూస్ నాకాలని ఉంది - ‘యానిమల్’ దర్శకుడు, రణబీర్‌పై ఆర్జీవీ ప్రశంసలు

టాప్ స్టోరీస్

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
×