Odela 2 Teaser: నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే... పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
Odela 2 Teaser : తమన్నా శివశక్తిగా నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'ఓదెల 2'. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేయగా, అదిరిపోయే బీజిఎం, విజువల్స్ తో టీజర్ అంచనాలను పెంచింది.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) శివశక్తిగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ 'ఓదెల 2' (Odela 2 Movie). గత కొన్ని రోజులుగా మేకర్స్ ఈ మూవీ నుంచి అప్పుడప్పుడు అప్డేట్స్ రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేసి, తమన్నా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు.
పంచభూతాలు ఈ రూపానికే దాసోహం
టీజర్ మొదట్లోనే ఢమరుకం, సైకిల్ బెల్ సౌండ్స్ వంటి అదిరిపోయే బిజీఎంతో... నంది, శివలింగం విజువల్స్ తో గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఆ తర్వాత లేడీ అఘోరి పాత్రలో తమన్నా ఎంట్రీ మామూలుగా లేదు. ఫస్ట్ పార్ట్ లో హత్య చేసిన వశిష్ట ఆత్మగా మారి తిరిగి రాబోతున్నట్టు టీజర్ లో చూపించారు. మధ్యలో హెబ్బా పటేల్ తో పాటు మొదటి పార్ట్ లో ఉన్న కొన్ని సీన్స్ ను ఈ పార్ట్ కు కూడా లింక్ చేశారు. ఇక చేతబడులు చేసే వ్యక్తిగా శ్రీకాంత్ అయ్యంగార్, ముల్లా సాబ్ పాత్రలో మురళీ శర్మ సరికొత్తగా కనిపించారు. చివర్లో "నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే" అంటూ ఓ రూపం భయంకరంగా చెప్పిన డైలాగ్ తో టీజర్ ముగిసింది. టీజర్ సాగినంత సేపు బ్యాగ్రౌండ్ లో వచ్చిన బిజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. శివశక్తిగా తమన్నా ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అనిపిస్తుంది.
Read Also : కళ్ళ ముందే తిరిగినా పట్టించుకోలేదు... సీక్రెట్ వెడ్డింగ్ గురించి స్పందించిన తాప్సీ
టీజర్లో 'అరుంధతి' ఛాయలు
'ఓదెల 2' టీజర్లో అక్కడక్కడా కొన్ని సీన్స్, సినిమాలోని పాత్రలు 'అరుంధతి' మూవీని గుర్తుతెచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా చనిపోయిన విలన్ ప్రేతాత్మగా మారడం, మురళీ శర్మ ముల్లా క్యారెక్టర్ 'అరుంధతి'కి లింక్ అవుతున్నాయి. అయితే విజువల్స్, స్క్రీన్ ప్లే, బిజిఎం మాత్రం అదిరిపోయాయి. డైరెక్టర్ సంపత్ నంది తన మార్క్ తో 'ఓదెల 2'పై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచేశారు. టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినప్పటికీ అజనీష్ లోక్నాథ్ బిజిఎం హైప్ పెంచింది. ఇక తమన్నా లేడీ అఘోరి పాత్రలో ఆకట్టుకుంది. ఓవరాల్ గా చెప్పాలంటే కట్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
అశోక్ తేజ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ 'ఓదెల 2'. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంపత్ నంది టీం వర్క్ తో కలిసి మధు క్రియేషన్స్ బ్యానర్ పై డి మధు ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మహా కుంభమేళాలో రిలీజ్ చేశారు. 2022లో రిలీజ్ అయిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు కొనసాగింపుగా 'ఓదెల 2' తెరకెక్కుతోంది. టీజర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలతో ఆకట్టుకుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

