అన్వేషించండి

Nuvvu Nenu Heroine Anita: ‘నువ్వు నేను’ షూటింగ్‌లో మమ్మల్ని సరిగా చూసుకోలేదు - హీరోయిన్ అనిత షాకింగ్ కామెంట్స్

Nuvvu Nenu Heroine Anita: 23 ఏళ్ల తర్వాత ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘నువ్వు నేను’ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ వీడియోను విడుదల చేసింది అనిత.

Nuvvu Nenu Heroine Anita about Uday Kiran: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఎవర్‌గ్రీన్ సినిమాలు ఎన్నిసార్లు రీ రిలీజ్ అయినా ప్రేక్షకులు చూస్తారు అనే భావనలో మేకర్స్ ఉన్నారు. అలా ఎన్నో చిత్రాలను రీ రిలీజ్ చేసి హ్యాపీ చేసిన మేకర్స్.. త్వరలోనే ఉదయ్ కిరణ్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో ముందుగా ‘నువ్వు నేను’ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. ఇప్పటికీ హీరో ఉదయ్ కిరణ్ అంటే చాలామందికి ఇష్టం. తన సినిమాలు, పాటలను ప్రత్యేకంగా ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తనతో కలిసి నటించిన ‘నువ్వు నేను’ రీ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. హీరోయిన్ అనిత ఒక వీడియో ద్వారా స్పందించింది.

గర్వంగా ఉంది..

తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అనిత.. ఉదయ్ కిరణ్‌కు బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ అని పేరు కూడా దక్కించుకుంది. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్‌ను వదిలేసి పూర్తిగా బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ‘నువ్వు నేను’ రీ రిలీజ్ సందర్భంగా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ‘‘నువ్వు నేను సినిమా రీ రిలీజ్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. నేను, ఉదయ్, టీమ్ మొత్తం కలిసి సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. అందుకే సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం ఆనందాన్ని ఇచ్చింది. నిజం చెప్పాలంటే సినిమా షూటింగ్ అప్పుడు నన్ను, ఉదయ్‌ను అంత బాగా చూసుకోలేదు’’ అంటూ ‘నువ్వు నేను’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది అనిత.

చాలా మిస్ అవుతున్నాం..

‘‘మమ్మల్ని ఎలా చూసినా కూడా నువ్వు నేను సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడంతో నెగిటివ్ ఆలోచనలు అన్ని మాయమయిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవ్వడంతో దానికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి. మీరందరూ ‘నువ్వు నేను’ను మళ్లీ ప్రేమిస్తారని ఆశిస్తున్నాను. నేను, నీ ఫ్యాన్స్ అందరూ నిన్ను చాలా మిస్ అవుతున్నాం ఉదయ్. ఈరోజును నేరుగా చూడడానికి నువ్వు ఉండుంటే బాగుండేది అనిపిస్తోంది’’ అంటూ ఉదయ్ కిరణ్‌ను తాను ఎంత మిస్ అవుతుందో తెలిపారు అనిత. అనిత, ఉదయ్ కిరణ్ రెండు సినిమాల్లో కలిసి నటించారు. ఆ రెండు చిత్రాలతోనే వీరి పెయిర్ చాలా బాగుంది అంటూ మంచి మార్కులు కొట్టేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

21 ఏళ్లకే..

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్వు నేను’ 2001లో విడుదలయ్యింది. అప్పట్లోనే ఈ మూవీ సూపర్ సక్సెస్‌ను సాధించింది. ఎక్కువగా కమర్షియల్ చిత్రాలను చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న రోజుల్లో ‘నువ్వు నేను’ అనేది ఒక అందమైన ప్రేమకథగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమాలో నటిస్తున్న సమయానికి 21 ఏళ్లు మాత్రమే. అయినా అద్భుతంగా నటించి అందరికి చాలా దగ్గరయిపోయాడు. ఇక తెలంగాణ శకుంతలను తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది ఈ సినిమా. ముఖ్యంగా లేడీ విలన్ పాత్ర పోషించడానికి తెలంగాణ శకుంతల బెస్ట్ అని మేకర్స్ డిసైడ్ అయ్యేలా చేసింది. అలాంటి ‘నువ్వు నేను’ మార్చి 21న థియేటర్లలో రీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది.

Also Read: ఆలియాకు రాజమౌళి ఇచ్చిన సలహా ఇదేనట - మరి మన స్టార్స్ ఫాలో చేస్తారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Vallabhaneni Vamsi: కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? -  ముగిసిన పోలీసుల కస్టడీ !
కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? - ముగిసిన పోలీసుల కస్టడీ !
Warangal Crime News: డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !
డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !
Viral News: ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
Embed widget