అన్వేషించండి

Warangal Crime News: డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !

Telangana: వరంగల్ లో డాక్టర్ పై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేధించారు. జిమ్ ట్రైనర్ తో వివాహేతర బంధం పెట్టుకుని అతని భార్యే ప్లాన్ చేసిందని గుర్తించి అరెస్టు చేశారు.

Warangal Doctor Case: భర్త డాక్టర్... భార్య ప్రభుత్వ లెక్చలర్. ఇద్దరు సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ దంపతుల జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ భార్య మనస్సు మరో వ్యక్తి పడింది. వివాహేతర సంబంధం గా మారింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న భర్త డాక్టర్ సుమంత్ రెడ్డి ని హతమార్చేందుకు ప్రియుడు కలిసి ప్లాన్ వేసింది భార్య ఫ్లోరా మరియా. ప్లాన్ ప్రకారం ఈ నెల 20 వ తేదీన వరంగల్ లో భర్త ను హత్య చేయించే ప్రయత్నం చేయగా తీవ్రగాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. హత్యాయత్నానికి ప్లాన్ వేసిన ఫ్లోరా ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కానిస్టేబుల్ జైల్ పాలయ్యారు.
 
వివాహేతర సంబంధమే హత్యయత్నం కు కారణం 

వరంగల్ లో యువ వైద్యుడిపై జరిగిన హత్యాయత్నం కేసును వరంగల్ కమిషనరేట్ మిల్స్ కాలనీ పోలీసులు  ఛేదించారు. డాక్టర్ భార్యే ప్రధాన సూత్రధారి అని తేల్చారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసినట్లు నిర్దారించారు. నిందితులైన గాదె ఫ్లోరా మరియా, ఫ్లోరా ప్రియుడు ఏర్రోళ్ల శామ్యూల్, వీరికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ మంచుకురి రాజ్ కుమార్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ చెప్పారు.

భార్య ఆరోగ్యం కోసం ఆలోచించి. భర్త ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

వరంగల్ కు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డికి ఫ్లోరా మరియాతో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. వివాహం అనంతరం సుమంత్ రెడ్డి దంపతులు 2018లో సంగారెడ్డి లో బంధువుల విద్యాసంస్థలను చూసుకోవడం కోసం వెళ్ళారు. కొద్ది రోజుల తరువాత డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి PHC లో కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్ గా చేరగా. భార్య ఫ్లోరా మరియా స్కూల్లో టీచర్ గా పని చేస్తుండేది. వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. భార్య ఆరోగ్యం కోసం బరువు తగ్గాలని చెప్పగా. ఆమె సంగారెడ్డిలోని సిద్దు జిమ్ సెంటర్ కి వెళ్తుండేది. ఈ క్రమంలో జిమ్ సెంటర్లో కోచ్ గా పని చేస్తున్న ఏర్రోల్ల శామ్యూల్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. విషయం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలియడంతో భార్య ఫ్లోరా మరియాను పలు మార్లు మందలించారు. ఫ్లోరా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి నుండి ఫ్యామిలీని వరంగల్ కు షిఫ్ట్ చేశారు. 2019 సంవత్సరంలో ఫ్లోరా మరియా లెక్చరర్ ఉద్యోగం పొంది జనగామ జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో విధులు నిర్వహిస్తూ అక్కడే వుండేవారు. తర్వాత కాలేజ్ వరంగల్ లోని రంగశాయిపేట్ మారడంతో డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్లోని వాసవి కాలనీలో ఉంటూ కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ వెళ్లి వస్తున్నాడు.

ఫ్లోరా మరియా ప్రవర్తనలో మార్పు రాలేదు.

వరంగల్ షిఫ్ట్ అయిన ఫ్లోరా మరియా బుద్ధి మారలేదు. ప్రియుడు శామ్యూల్ తో తరచుగా ఫోన్ లో మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం. డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో శామ్యూల్ వరంగల్ వచ్చి వెళ్ళేవారు. డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించడం, ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త సుమంత్ రెడ్డి ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. శామ్యూల్ ఈ విషయాన్ని స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కు చెప్పాడు. డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యకి సహకరిస్తే సంగారెడ్డిలో ఇంటిని నిర్మించి ఇస్తానని చెప్పగా దానికి సదరు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఒప్పుకొన్నాడు.

15 రోజుల క్రితం లక్ష రూపాయలు ఫ్లోరా మరియా, శామ్యూల్ కు ట్రాన్స్ఫర్ చేసినట్లు వరంగల్ ఎసిపి నందిరాం నాయక్ తెలిపారు. అందులో నుండి ఖర్చులకు 50 వేలు శామ్యూల్ తీసుకోని, మిగిలిన 50 వేలు శామ్యూల్ AR హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కు ఇచ్చాడు. ఇంకేముంది ఈ నెల 20 వ తేదీన డాక్టర్ సుమంత్ రెడ్డి ని హత్య చేసేందుకు కాజీపేట నుండి వరంగల్ కు వెళ్ళే హంటర్ రోడ్డు సీసీ కెమెరాలు, జనసంచారం లేని భట్లుపల్లి రోడ్డుకు వెళ్లే మార్గాన్ని  ఎంచుకున్నారు. రోజు వారిలాగే సుమంత్ రెడ్డి రాత్రి తన క్లినిక్ కాజీపేట నుండి కారులో భట్టుపల్లి రోడ్డు నుండి రంగాశాయపేట వెళ్తున్న క్రమంలో వెనుక ఫాలో అయ్యి భట్టుపల్లి శివారులో డాక్టర్ సుమంత్ రెడ్డి కారును అడ్డగించారు. శామ్యూల్, రాజ్ కుమార్ లు సుమంత్ రెడ్డి ని కారు దింపి విచక్షణారహితంగా ఇనుప రాడ్లతో కొట్టి చనిపోయాడనుకొని   పరారయ్యారు. అయితే చావుబతుకున్న ఉన్న డాక్టర్ ను చూసిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. 

డాక్టర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసుకొని, దర్యాప్తు కోసం ప్రత్యక బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేశారు.  నిందితులను విచారించగా హత్యకు సూత్రధారి డాక్టర్ భార్య ఫ్లోరా మరియా చెప్పారని అరెస్ట్ చేసి విచారణ అంతరం కేసునమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎసిపి నందిరాం నాయక్ తెలిపారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
తొక్కలో సెంచరీ రేపైనా చేస్తా..అయ్యర్ గొప్పతనానికి షాకైన శశాంక్
తొక్కలో సెంచరీ రేపైనా చేస్తా..అయ్యర్ గొప్పతనానికి షాకైన శశాంక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
తొక్కలో సెంచరీ రేపైనా చేస్తా..అయ్యర్ గొప్పతనానికి షాకైన శశాంక్
తొక్కలో సెంచరీ రేపైనా చేస్తా..అయ్యర్ గొప్పతనానికి షాకైన శశాంక్
Viral Post:  గూగుల్ సీఈఓ పిచాయ్ ను స‌ర్ప్రైజ్ చేసిన టైటాన్స్.. ఆ ఆట‌గాడిని ఎందుకు ఆడించ‌డం లేదంటూ ఆయన ఎంక్వైరీ..  సోష‌ల్ మీడియాలో వైర‌లైన పోస్ట్
గూగుల్ సీఈఓ పిచాయ్ ను స‌ర్ప్రైజ్ చేసిన టైటాన్స్.. ఆ ఆట‌గాడిని ఎందుకు ఆడించ‌డం లేదంటూ ఆయన ఎంక్వైరీ.. సోష‌ల్ మీడియాలో వైర‌లైన పోస్ట్
Viral News: 2 వారాల కిందటే పెళ్లి - భర్తను చంపడానికి సుపారీ ఇచ్చేసింది - ఈ భార్య చాలా వయోలెంట్ !
వారాల కిందటే పెళ్లి - భర్తను చంపడానికి సుపారీ ఇచ్చేసింది - ఈ భార్య చాలా వయోలెంట్ !
Lady Don Sangeetha Sahu: ఒడిషాలో గంజాయి డాన్ సంగీత సాహు అరెస్ట్ - అబ్బో ఈమె కళాపోషణ చూసి తరించాల్సిందే !
ఒడిషాలో గంజాయి డాన్ సంగీత సాహు అరెస్ట్ - అబ్బో ఈమె కళాపోషణ చూసి తరించాల్సిందే !
New Banking Rules: ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
Embed widget