అన్వేషించండి

Nara Rohith Wedding: ప్రేమలో పడిన సంగతి నారా రోహిత్ ముందు ఎవరికి చెప్పారో తెలుసా? పెళ్లి ఎప్పుడంటే?

Nara Rohith Wedding Date: నారా రోహిత్, శిరీషా నిశ్చితార్థం ఆదివారం జరిగింది. మరి, పెళ్లి ఎప్పుడు చేసుకోబుతున్నారు? వీరి పెళ్లికి పెద్ద ఎవరు? అసలు ఈ ప్రేమ విషయం ముందుగా ఇంట్లో ఎవరికి చెప్పారో తెలుసా?

నారా రోహిత్ (Nara Rohith) ప్రేమ విషయం చాలా మందికి సర్‌ప్రైజ్ అని చెప్పాలి.‌‌ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట ప్రేమ వివాహం జరుగుతుందని, ఆయన సోదరుని కుమారుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడతారని ఎవరు ఊహించలేదు. 'ప్రతినిధి 2' సినిమాలో తనతో నటించిన సిరి అలియాస్ శిరీషతో నారా రోహిత్ ఏడు అడుగులు వేయడానికి ఆదివారం మొదటి అడుగు వేశారు. ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రేమలో పడిన తర్వాత ఆయన ఈ విషయం ముందుగా ఎవరితో చెప్పారో తెలుసా? 

పెద్దమ్మతో ప్రేమ విషయం చెప్పిన రోహిత్...
సంబంధం మాట్లాడిన చంద్రబాబు భార్య భువనేశ్వరి!
క్రమశిక్షణకు మారుపేరుగా నారా చంద్రబాబు నాయుడును ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు చెబుతూ ఉంటారు. ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కోసం ఆయన పరితపిస్తారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు, మరోవైపు పార్టీ కార్యకలాపాలతో ఆయన ఎప్పుడూ బిజీ. నారా లోకేష్ సైతం మంత్రిగా బిజీ బిజీగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు తర్వాత ఏపీ ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. పెదనాన్న, అన్నయ్య ఎంత బిజీ అనేది నారా రోహిత్ కు బాగా తెలుసు. అందుకే తన ప్రేమ విషయాన్ని‌ పెద్దమ్మ భువనేశ్వరితో ఆయన పంచుకున్నారని సమాచారం.

అబ్బాయి రోహిత్ ప్రేమ విషయం తెలిసిన తర్వాత... భువనేశ్వరి పెళ్లి పెద్దగా మారారని నారా, నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. శిరీష కుటుంబ సభ్యులతో ఆవిడ స్వయంగా మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట. చంద్రబాబు, భువనేశ్వరి ఆశీస్సులతో ఆదివారం నోవాటెల్ హోటల్ లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. మరి, పెళ్లి ఎప్పుడో తెలుసా?

నారా రోహిత్, శిరీష ఏడు అడుగులు వేసేది ఎప్పుడు?
నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయినట్టే. మరి, అసలు వివాహ వేడుక ఎప్పుడు? శిరీషతో కలిసి నారా రోహిత్ ఏడు అడుగులు వేసేది ఎప్పుడు? అంటే... ఈ ఏడాది ఆఖరిలో అని తెలుస్తోంది. డిసెంబర్ నెలలో పెళ్లి ముహూర్తాలు చూస్తున్నారని సమాచారం.‌ రాజకీయ, సినిమా వర్గాలలో నారా కుటుంబ పలుకుబడి తెలిసిందే. వివాహానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుంది. అందరికీ ఆహ్వానాలు అందించడానికి నెలన్నరకు పైగా సమయం పడుతుంది.

Also Readమర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఖాన్ ఎందుకు వెళ్లారు? ఆస్పత్రికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు? ఎవరీ బాబా సిద్ధిఖీ??


సిరి లేళ్లగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన 'ప్రతినిధి 2' కథానాయిక అసలు పేరు శిరీష. ఏపీలో ఆయన తండ్రి పారిశ్రామికవేత్త అని తెలుస్తోంది. హైదరాబాద్ సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా అక్కడ మాస్టర్స్ పూర్తి చేశాక ఇండియా తిరిగొచ్చారు. నటన మీద ఆసక్తితో 'ప్రతినిధి 2' చేశారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో నారా రోహిత్, శిరీష ప్రేమలో పడ్డారు. త్వరలో వివాహ బంధంలో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు.

Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget