నారా రోహిత్ హీరోగా నటించిన 'ప్రతినిధి 2'లో ప్లస్, మైనస్‌లు, హైలైట్స్ ఏంటో మినీ రివ్యూలో చూడండి.

కథ: చేతన్ (నారా రోహిత్) నిర్భయంగా నిజాలు వెలుగులోకి తెచ్చే... ప్రాణాలు సైతం లెక్క చేయని జర్నలిస్ట్.

చేతన్ ఇంటర్వ్యూ కారణంగా గజేంద్ర (అజయ్ ఘోష్) మంత్రి పదవి పోతుంది. నరసింహ (పృథ్వీ) ఓడిపోతాడు.

సీఎం ప్రజాపతి (సచిన్ ఖేడేకర్) చూపుల్లో పడిన చేతన్... ఆయన బాంబు బ్లాస్ట్ కేసులో అరెస్ట్ కావడం ఏమిటి?

సీఎంను ఎవరు చంపారు? చేతన్ ఏం చేశాడు? సీఎం కొడుకు విశ్వ (దినేష్ తేజ్) పాత్ర ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.

ఎలా ఉంది?: సీఎంగా సచిన్ ఖేడేకర్‌ను చూస్తే వైయస్సార్, ఆయన కొడుకుగా దినేష్ తేజ్‌ను చూస్తే జగన్ గుర్తుకు రావచ్చు.

వైయస్సార్, జగన్ గుర్తొచ్చినా వాళ్లను టార్గెట్ చేసిన సినిమా కాదు 'ప్రతినిధి 2'. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్.

రాజకీయ అవినీతిని ప్రాజెక్ట్ చేసే ఫస్టాఫ్, సీన్లలో పట్టు చూపించిన దర్శకుడు మూర్తి... ఇన్వెస్టిగేషన్‌లో పట్టు కోల్పోయారు.

'ప్రతినిధి'తో 'ప్రతినిధి 2'ను కంపేర్ చేయలేం. కానీ, ఇందులో కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి.

నారా రోహిత్ పెర్ఫార్మన్స్ బావుంది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఓసారి చూడొచ్చు.