కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ హీరోగా రూపొందిన 'కృష్ణమ్మ'లో ప్లస్ & మైనస్ పాయింట్స్, హైలైట్స్ ఏంటో చూడండి.

కథ: అనాథలైన భద్ర (సత్యదేవ్), శివ (కృష్ణ తేజా రెడ్డి), కోటి (మీసాల లక్ష్మణ్) విజయవాడలోని వించిపేటలో ఉంటారు.

భద్ర, కోటి గంజాయి స్మగ్లర్స్. శివ ప్రింటింగ్ ప్రెస్ రన్ చేస్తున్నాడు. మీనా (అతిరా రాజ్)తో శివ ప్రేమలో పడతాడు.

మీనా రాకతో ముగ్గురి అనాథల జీవితాలు మారతాయి. గంజాయి స్మగ్లింగ్ మానేసిన భద్ర ఆటో డ్రైవర్ అవుతాడు. 

ఆల్ హ్యాపీస్ అనుకుంటే... రేప్ అండ్ మర్డర్ కేసులో ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా.

ఎలా ఉంది?: ఆయేషా మీరా హత్యాచార ఘటన స్ఫూర్తితో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ సినిమా 'కృష్ణమ్మ'.

దర్శకుడు వీవీ గోపాలకృష్ణ టేకింగ్ బావుంది. యాక్షన్ & ఎమోషన్స్ క్యాప్చర్ చేసిన తీరు బావుంది.

'కృష్ణమ్మ ఫస్టాఫ్ సోసోగా ఉంది. రొటీన్ రైటింగ్ అవాయిడ్ చేస్తే బావుండేది. ట్విస్ట్ రివీలయ్యాక యాక్షన్ & ఎమోషన్ వర్కవుట్ అయ్యాయి. 

భద్ర పాత్రకు సత్యదేవ్ ప్రాణం పోశారు. ప్రాణం పెట్టి నటించారు. దాంతో చాలా సీన్లు నిలబడ్డాయి. మిగతావాళ్లు ఓకే.

సత్యదేవ్ యాక్టింగ్, రా & రస్టిక్ ఎమోషన్స్ కోసం 'కృష్ణమ్మ'కు ఒకసారి వెళ్లొచ్చు. అదీ అంచనాలు లేకుండా!

Thanks for Reading. UP NEXT

బాక్ రివ్యూ: తమన్నా, రాశీ ఖన్నా హారర్ కామెడీ హిట్టా? ఫట్టా?

View next story