హీరో విశాల్, దర్శకుడు హరి కలయికలో వచ్చిన మాస్ యాక్షన్ ఫిల్మ్ 'రత్నం'లో ప్లస్, మైనస్‌లు ఏంటి? మినీ రివ్యూలో చూడండి. 

కథ: రత్నం (విశాల్)ది చిత్తూరు. ఎమ్మెల్యే పన్నీర్ (సముద్రఖని) అండతో తప్పు చేసినోళ్ల తాట తీస్తాడు.

మల్లిక (ప్రియా భవానీ శంకర్)ను అనుకోకుండా రోడ్డు మీద చూస్తాడు. ఆమెకు ఆపద వస్తే సాయం చేస్తాడు. 

ప్రాణాలకు తెగించి మరీ ఓ స్థలం వివాదంలో మల్లికకు రత్నం ఎందుకు సాయం చేశాడు? ఆమెను ఎందుకు 'అమ్మా' అంటున్నాడు?

లింగం (మురళీ శర్మ) బ్రదర్స్ వర్సెస్ మల్లిక గొడవలో రత్నం వచ్చాక ఏమైంది? లింగం, రత్నం మధ్య కనెక్షన్ ఏమిటి? అనేది సినిమా. 

ఎలా ఉంది?: అవుట్ డేటెడ్ యాక్షన్ ఫిల్మ్ 'రత్నం'. హరి పది పదిహేనేళ్ల క్రితం తీసిన సినిమాల టైపులో ఉంది.

యాక్షన్ సీన్స్, దేవిశ్రీ సాంగ్స్ తప్పిస్తే... ఒక్కటంటే ఒక్క సీన్ బాలేదు. యాక్షనూ హరి స్టైల్‌లో ఉంది తప్ప కొత్తగా లేదు.

విశాల్, ప్రియా భవానీ శంకర్ మధ్య రిలేషన్షిప్ సీన్స్ బ్యాక్ ఫైర్ అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

'రత్నం'... అవుట్ డేటెడ్ యాక్షన్ ఫిల్మ్. కొంచెం కూడా కొత్తదనం లేని ఈ సినిమాను యాక్షన్ సీన్స్ కోసం భరించడం కష్టమే.

Thanks for Reading. UP NEXT

పారిజాత పర్వం రివ్యూ: క్రైమ్ కామెడీలో ప్లస్, మైనస్‌లు ఏంటి?

View next story