అంజలి 50వ సినిమా, 'గీతాంజలి'కి సీక్వెల్ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'లో ప్లస్, మైనస్‌లు ఏంటి? హైలైట్స్ ఏంటో చూడండి.

కథ: సంగీత్ మహల్‌లో సినిమా తీయాలని శ్రీను (శ్రీనివాస రెడ్డి)కి విష్ణు (రాహుల్ మాధవ్) ఆఫర్ ఇస్తాడు.

సినిమా షూటింగ్ కోసం సంగీత్ మహల్‌లో ఎంటరైన శ్రీను, అంజలి అండ్ కోకి అక్కడ దెయ్యాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఆత్మలుగా మారిన శాస్త్రి (రవిశంకర్) ఫ్యామిలీ నేపథ్యం ఏమిటి? అంజలి సోదరి గీతాంజలి ఆత్మ మళ్లీ ఎందుకు వచ్చింది?

విష్ణు తండ్రి (రావు రమేష్) ఆత్మకు, గీతాంజలి ఆత్మకు మధ్య గొడవ ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ: రెగ్యులర్ అండ్ రొటీన్ ఫార్మాట్ స్క్రిప్ట్‌తో తెరకెక్కిన సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'. కొత్తదనం ఏమీ లేదు.

మహల్‌లో దెయ్యాలు, మనుషులు కాన్సెప్ట్ సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. 'రాజు గారి గది' వంటివి.

'గీతాంజలి 2' ఫస్టాఫ్ సోసోగా ఉంది. సెకండాఫ్‌లో షూట్‌లోకి దెయ్యాలు వచ్చాక కామెడీ పీక్స్‌లోకి వెళ్లింది. క్లైమాక్స్ బాలేదు. 

పేరుకు అంజలి 50వ సినిమా. కానీ, ఇందులో ఆమెకు నటనకు స్కోప్ ఉన్న రోల్ లేదు. జస్ట్ హీరోయిన్ ఉందంతే!

సినిమాకు అసలైన హీరో సత్య. ఆయన కామెడీకి జనాలు పడీపడీ నవ్వుతారు. సత్య కోసం ఎవరైనా వెళ్లాలని అనుకుంటే వెళ్లొచ్చు.