'దొరసాని' దర్శకుడు కెవిఆర్ మహేంద్ర తీసిన కొత్త సినిమా 'భరతనాట్యం'. ఇదెలా ఉందో మినీ రివ్యూలో చూడండి. 

కథ: రాజు సుందరం (తేజా ఏలే) అసిస్టెంట్ డైరెక్టర్. రెంట్ సంగతి తర్వాత కనీసం టీ డబ్బులు కూడా లేవు.

పెళ్లి చేసుకోమని లవర్ అభి (మీనాక్షీ గోస్వామి) గోల ఓ వైపు... తల్లి ఆపరేషన్‌కు డబ్బు అవసరం మరోవైపు!

రెస్టారెంట్‌లో దిల్‌సుఖ్ నగర్ దివాకర్ (హర్షవర్ధన్) తమ్ముడు రంగ (టెంపర్ వంశీ) దగ్గర బ్యాగ్ కొట్టేస్తాడు.

బ్యాగులోని భగత నాట్యం (డ్రగ్స్) కోసం దివాకర్ & రంగ ఏం చేశారు? రాజుకు ఎదురైన రిస్క్ ఏంటి? అనేది సినిమా. 

ఎలా ఉంది?: 'భరతనాట్యం' చూసినంత సేపూ 'దొరసాని' తీసింది మహేంద్రేనా? అనే డౌట్ వస్తుంది.

స్టార్టింగ్ టు ఎండింగ్... ఒక్క సీన్, సాంగ్ సరిగా తీయలేదు. సినిమాలో బావుందని చెప్పడానికి అసలు ఏమీ లేదు.

హీరోగా పరిచయమైన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కుమారుడు తేజకు నటనలో బేసిక్స్ కూడా రావు.

నటుడిగా ఫెయిల్ అయిన తేజ రచయితగా మంచి పాయింట్ రాశాడు. దాన్ని కథగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు.

హర్షవర్ధన్, వైవా హర్ష, అజయ్ ఘోష్, కృష్ణుడు, మస్త్ అలీని సరిగా వాడుకోలేదు. మీనాక్షీకి నటన రాదు.

'భరతనాట్యం'... రెండు గంటల టార్చర్. కాసేపు కూడా సినిమా చూడలేం. అవాయిడ్ చేయండి.

Thanks for Reading. UP NEXT

టిల్లు స్క్వేర్ రివ్యూ: సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి?

View next story