నటుడిగా ప్రేక్షకుల్ని నవ్వించి, ఏడిపించిన వైవా హర్ష 'సుందరం మాస్టర్'లో హీరోగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ: సుందర్ రావు (వైవా హర్ష) సోషల్ స్టడీస్ టీచర్. ప్రపంచంతో సంబంధం లేని ఓ గూడేనికి ఇంగ్లీష్ చెప్పమని పంపిస్తారు.

గూడెంలో విలువైనది ఏదో ఉందని, అది కనిపెడితే డీఈవోగా ప్రమోషన్ ఇస్తానని సుందరానికి ఎమ్మెల్యే ఆశ పెడతాడు.

ట్విస్ట్ ఏమిటంటే... గూడెంలో ప్రజలు ఇంగ్లీష్ ఇరగదీస్తారు. సుందరానికి ఇంగ్లీష్ రాదని కనిపెడతారు.

సుందరానికి ఇంగ్లీష్ రాదని తెలిసి ఏం చేశారు? గూడెంలో విలువైనది సుందరం కనిపెట్టాడా? లేదా? అనేది సినిమా. 

ఎలా ఉంది?: 'సుందరం మాస్టర్'కు బలం, బలహీనత కథే. సినిమాలో కామెడీ, ఫిలాసఫీ... రెండూ ఉన్నాయి.

ఫస్టాఫ్‌లో కామెడీ, సెకండాఫ్‌లో ఫిలాసఫీ ఫ్రంట్ సీట్ తీసుకున్నాయి. కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది.

ఫస్టాఫ్‌లో కథ లేకున్నా కామెడీతో నవ్వించారు. ఫిలాసఫీ బావున్నా ప్రేక్షకులకు రీచ్ అవుతుందా? అనేది డౌట్.

సుందరంగా వైవా హర్ష ఒదిగిపోయాడు. దివ్య శ్రీపాద, బాలకృష్ణ సహా మిగతా వాళ్లు చక్కగా చేశారు.

శ్రీచరణ్ పాకాల సంగీతం, దీపక్ సినిమాటోగ్రఫీ సూపర్. దర్శకుడు కళ్యాణ్ సంతోష్ మంచి మాటలు రాశారు.

ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే 'సుందరం మాస్టర్' నవ్విస్తాడు. మంచి సందేశం ఇస్తాడు.