'యాత్ర 2'లో ప్లస్, మైనస్‌లతో పాటు సినిమాగా చూస్తే ఈ రాజకీయ చరిత్ర ఎలా ఉందో మినీ రివ్యూలో చూడండి. కథ: వైయస్సార్ (మమ్ముట్టి) ఎంపీగా పోటీ చేస్తున్న తన కుమారుడు జగన్ (జీవా)ను ప్రజలకు పరిచయం చేస్తారు. వైయస్సార్ మరణించాక జగన్ సీఎం కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేస్తే... ప్రోగ్రెస్ పార్టీ పట్టించుకోదు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను ఆపమని మేడమ్ (సోనియా గాంధీ) చెబుతుంది. ప్రోగ్రెస్ నుంచి బయటకొస్తాడు జగన్. వైఎస్ఆర్‌సీపీ స్థాపించిన జగన్, తెలుగునాడు చంద్రబాబును ఎదుర్కొని సీఎం ఎలా అయ్యాడు? అనేది సినిమా. విశ్లేషణ: జగన్ vs చంద్రబాబు కథగా చూస్తే... 'యాత్ర 2'పై కంప్లైంట్ ఉంటుంది. జగన్‌ను గ్లోరిఫై చేశారని అనిపిస్తుంది. సినిమాగా చూస్తే... టెక్నికల్‌గా బెస్ట్ మూవీ. తెలిసిన కథను ఆసక్తిగా చెప్పడంలో మహి సక్సెస్ అయ్యారు. మహి మాటలకు సంతోష్ నారాయణన్ సంగీతం తోడు కావడంతో విజిల్స్ వేసే సీన్లు పడ్డాయి. ఫస్టాఫ్ బావుంది. ఎమోషన్, డ్రామా కుదిరాయి. సెకండాఫ్‌లో డ్రామా తగ్గింది. కీ ఎపిసోడ్స్ కొన్ని మిస్ చేశారు. మమ్ముట్టికి తోడు ఈసారి జీవా అద్భుతంగా నటించారు. స్క్రీన్ మీద జగన్ కనిపించేలా నటించారు. కాస్టింగ్ పర్ఫెక్ట్ యాప్ట్. జగన్ ఫ్యాన్స్‌కు 'యాత్ర 2' నచ్చుతుంది. మిగతా వాళ్లకు డీసెంట్ ఫిల్మ్. ప్రత్యర్థి పార్టీ ఫ్యాన్స్‌కు నచ్చే ఛాన్స్ తక్కువ.