కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ తర్వాత సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' ఎలా ఉందో రివ్యూలో చూడండి.

కథ: మల్లి (సుహాస్), పద్మ (శరణ్య) కవలలు. లక్ష్మి (శివాని నాగరం)కి మల్లి లైన్ వేస్తాడు. అమ్మాయీ అతణ్ణి ప్రేమిస్తుంది.  

ఊరి పెద్ద వెంకట బాబు (నితిన్ ప్రసన్న)కు లక్ష్మి చెల్లెలు. స్కూల్ టీచరైన పద్మ, వెంకట బాబుతో గొడవ పడుతుంది.

చెల్లెలికి మల్లి లైన్ వేయడం, పద్మ గొడవలు వెంకట బాబు సహించలేకపోయాడు. దాంతో పద్మను వివస్త్ర చేసి అవమానిస్తాడు. 

అక్కకు జరిగిన అవమానం తెలిసి మల్లి ఏం చేశాడు? వెంకట బాబు వర్సెస్ మల్లి గొడవలో ఊరి ప్రజలు ఏం చేశారు?

ఎలా ఉంది?: కులవివక్ష, అణిచివేత తమిళ సినిమాల్లో ఎక్కువ. 'రంగస్థలం', 'పలాస' ఆ కోవలో చిత్రాలే.

'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో కథ, కథనాల కంటే సన్నివేశాలు కొత్తగా గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి.

సుహాస్ ఎప్పటిలా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. శరణ్య అతడిని డామినేట్ చేశారు. నితిన్ ప్రసన్న కూడా బాగా చేశారు. 

శేఖర్ చంద్ర పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. 

ఫస్టాఫ్‌లో ప్రేమ కథ రోటిన్. కానీ, కామెడీ బావుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషనల్ హై ఇస్తుంది.