లావణ్య, అభిజీత్ జంటగా నటించిన హాట్‌స్టార్ ఒరిజినల్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. మినీ రివ్యూలో తెలుసుకోండి.

కథ: లావణ్య (లావణ్య త్రిపాఠి)కి క్లీనింగ్ అంటే ఇష్టం. ఆమె ఇంట్లో వంట, రోహిత్ ఇంట్లో క్లీనింగ్ చేసే పనిమనిషి జ్యోతి (అభిజ్ఞ).

కరోనా వల్ల తాను పనికి రావడం కుదరడం లేని, రోహిత్‌కు విషయం చెప్పమని లావణ్యను జ్యోతి రిక్వెస్ట్ చేస్తుంది.

రోహిత్ ఫ్లాట్‌కు వెళ్లిన లావణ్య చిందరవందరగా ఉండటంతో క్లీన్ చేస్తుంది. తన పేరు లక్ష్మి అని చెబుతుంది.

లక్ష్మితో ప్రేమలో పడతాడు రోహిత్. పనిమనిషి అని చూడకుండా ఆమెకు ఇష్టమైన వంటలు చేసి పెడతాడు. 

లక్ష్మి పనిమనిషి కాదని, లావణ్య అని రోహిత్‌కు తెలిసిందా? లేదా? ఆ ప్రేమ ఏ తీరాలకు చేరింది? అనేది సిరీస్.

ఎలా ఉంది?: కథ, కథనాల్లో కొత్తదనం లేదు. కామెడీ అసలే లేదు. నెక్స్ట్ ఏంటి? అనే క్యూరియాసిటీ కొంచెం కూడా లేదు.

లావణ్యకు ఓసీడీ అని చెప్పడం తప్ప అందుకు తగ్గ సీన్లు రాలేదు. దాంతో స్టార్ట్ టు ఎండ్ ఫ్లాట్‌గా వెళ్ళింది.

సిరీస్ రైటర్స్, డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఫెయిలయ్యారు. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ బావుంది.

లావణ్య, అభిజీత్ చక్కగా నటించారు. వాళ్ళ స్టైలింగ్ బావుంది. కానీ, వెబ్ సిరీస్ డిజప్పాయింట్ చేస్తుంది.