'ఊరు పేరు భైరవకోన'తో సందీప్ కిషన్‌కు హిట్ వస్తుందా? సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి? చూడండి.

కథ: బసవ (సందీప్ కిషన్) స్టంట్ మ్యాన్. గూడెం పిల్ల భూమి (వర్ష బొల్లమ్మ)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం దొంగగా మారతాడు. 

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొట్టేసిన నగలతో బసవ, జాన్ (వైవా హర్ష), గీత (కావ్య థాపర్) భైరవకోన వెళతారు.

భైరవకోనకు వెళ్లినోళ్లు తిరిగి రాలేరు. మరి, బసవ వచ్చాడా? ఆ కోనలో భూమి ఏం చేస్తుంది?

భైరవకోనకు, గరుడ పురాణాల్లో మిస్సైన నాలుగు పేజీలకు లింకేంటి? చివరకు ఏమైంది? అనేది సినిమాలో చూడాలి

విశ్లేషణ: వీఐ ఆనంద్ రాసిన కథ బావుంది. కథనంలో, దర్శకత్వంలో గాడి తప్పింది. సినిమా బోర్ కొట్టింది.

సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ బావుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ నవ్విస్తుంది. కొన్ని మూమెంట్స్ నచ్చుతాయి.

భైరవకోన ప్రపంచం ఆశ్చర్యపరుస్తుంది. ఆసక్తిగా మొదలైంది. ఇంటర్వెల్‌కు కథ రివీల్ చేయలేదు.

ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. ఆ తర్వాత కథ కిందకి పడింది. సిల్లీ ఫ్లాష్ బ్యాక్ సినిమాను నీరు గార్చింది.

సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ ప్రేమకథలో బలం లేదు. కావ్య థాపర్ పాత్రలో సరైన ట్రీట్మెంట్ పడలేదు.  

శేఖర్ చంద్ర సంగీతం సూపర్బ్. సినిమా రిలీజుకు ముందే సాంగ్స్ హిట్. రీ రికార్డింగ్ కూడా బాగా చేశారు. 

హీరో హీరోయిన్ల నటన, కామెడీ, పాటలు బావున్నా... ఇంటర్వెల్ తర్వాత నీరసం వస్తుంది. సినిమా డిజప్పాయింట్ చేస్తుంది.

Thanks for Reading. UP NEXT

యాత్ర 2 రివ్యూ: జగన్ సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి?

View next story