పృథ్వీరాజ్ డ్రీం ప్రాజెక్ట్స్‌లో ఒకటైన 'ఆడు జీవితం' విడుదలైంది. సినిమా ఎలా ఉంది? ప్లస్, మైనస్‌లు ఏంటి? ఒకసారి చూడండి.

కథ: నజీబ్ (పృథ్వీరాజ్) సౌదీలో వర్క్ చేయడానికి వెళతాడు. మంచి ఉద్యోగం, ఏసీ రూమ్ ఉంటాయని చెబుతారు.

సౌదీ వెళ్లిన నజీబ్ మోసపోతాడు. అతడిని ఎడారికి తీసుకువెళ్లి గొర్రెలు కాసే పని అప్పజెబుతారు. ఎడారిలో నజీబ్ పడిన కష్టాలెన్ని?

హకీమ్ (కెఆర్ గోకుల్), ఖాదిరి (జిమ్మీ జీన్ లూయిస్)తో కలిసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ: పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ పెర్ఫార్మన్స్ 'ది గోట్ లైఫ్' అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

నజీబ్ పాత్రకు పృథ్వీరాజ్ ప్రాణం పోశాడు. లుక్, గెటప్, వాయిస్... సీన్ టు సీన్, టైమ్ పీరియడ్ ప్రకారం వేరియేషన్ చూపించాడు. 

ఏఆర్ రెహమాన్ పాటలు, నేపథ్య సంగీతంతో పాటు సునీల్ కెఎస్ కెమెరా వర్క్ టాప్ క్లాస్ ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్బ్. 

కొన్ని సీన్లు సూపర్బ్. కానీ, కథ ముందుకు కదలదు. కష్టాలు చూడలేక, ఆ బాధ భరించలేక కోపం వస్తుంది.

ఎడారిలో అరబ్బు చేతిలో కష్టాలు భరించలేని కూలీ ఎలా తప్పించుకున్నాడు? అనేది కథ. పాయింట్ సాగదీశారు.

పృథ్వీరాజ్ నటన కోసం అయితే వెళ్లొచ్చు. అందర్నీ మెప్పించే సినిమా కాదిది. అవార్డులు వచ్చే సినిమా.