'టిల్లు స్క్వేర్'లో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? టిల్లన్న సేమ్ మేజిక్ రిపీట్ చేశాడా? మినీ రివ్యూలో చూడండి.

కథ: పార్టీలో కనిపించిన లిల్లీ (అనుపమ) వెంట పడతాడు టిల్లు (సిద్ధు). మాటలతో పడేసి రూంకి తీసుకెళతాడు.

టిల్లు, లిల్లీ రాత్రి ఒక్కటి అవుతారు. తెల్లారేసరికి లిల్లీ వెళ్లిపోతుంది. నెల తర్వాత కనిపించి ప్రెగ్నెంట్ అంటుంది.

లిల్లీ ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? పోలీస్, మాఫియా సంగతి ఏంటి? అనేది సినిమా.

విశ్లేషణ: టిల్లు క్యారెక్టర్ ఎంటర్టైన్ చేస్తుంది. సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి ఫుల్ పటాస్ అన్నట్లు నవ్వించాడు. 

టిల్లు వైబ్ కంటిన్యూ చేయడంలో దర్శకుడు మల్లిక్ రామ్ & రైటర్స్ సక్సెస్ అయ్యారు. కథపై ఇంకా కేర్ తీసుకోవాల్సింది. 

'డీజే టిల్లు' కథతో బాగా కనెక్ట్ చేశారు గానీ... ట్విస్ట్ & టర్నులు ఆ స్థాయిలో సర్‌ప్రైజ్ చేయలేదు.

రామ్ మిరియాల కంపోజ్ చేసిన సాంగ్స్, భీమ్స్ ఆర్ఆర్ కూడా సూపర్బ్. కెమెరా వర్క్ నీట్‌గా ఉంది. 

టిల్లుకు రాసిన పంచ్ డైలాగ్స్, సిద్ధు డైలాగ్ డెలివరీ, ఆయన నటన, అనుపమ గ్లామర్ & యాక్టింగ్ బావున్నాయి.

జస్ట్ కామెడీ కోసం 'టిల్లు స్క్వేర్'కి వెళ్లొచ్చు. టిల్లు మేజిక్ రిపీట్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ అంత లేదు గానీ ఒకే.