'గీత గోవిందం' సక్సెస్‌ను విజయ్, పరశురామ్ రిపీట్ చేశారా? 'ఫ్యామిలీ స్టార్' ఎలా ఉంది? మినీ రివ్యూలో చూడండి. కథ: కుటుంబ బాధ్యతలతో బడ్జెట్ లెక్కలు వేసుకుని బతికే మిడిల్ క్లాస్ యువకుడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ). పెంట్ హౌస్‌లో అద్దెకు దిగిన ఇందు (మృణాల్ ఠాకూర్)తో గోవర్ధన్ ప్రేమలో పడతాడు. ఇందుకు ప్రపోజ్ చేసే టైంకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద బుక్ రాయడానికి తమ దగ్గర నటించిందని గోవర్ధన్‌కి తెలుస్తుంది. గోవర్ధన్, ఇందు మధ్య దూరం పెరుగుతుంది. మళ్లీ ఇద్దరూ కలిసి అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అమెరికాలో ఏమైంది? చివరకు ఇందు, గోవర్ధన్ కలిశారా? లేదా? కొత్త విలన్ ఎవరు? అనేది సినిమా. ఎలా ఉంది: పరశురామ్ రాసిన కథలో అసలు కొత్తదనం లేదు. పాత సినిమాలు మిక్సీలో వేసినట్టు ఉంది. సినిమాలో ఫన్ & క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ, స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేసేలా లేవు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడీ కొంత వరకు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ల నటన ఓకే. అంచనాలు పెట్టుకోకుండా వెళితే కొన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేయవచ్చు. విజయ్ డిజప్పాయింట్ చేశాడు.