విజయ్ ఆంటోనీ 'రోమియో'గా నటించిన సినిమా 'లవ్ గురు'. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ: హీరోయిన్ అవ్వాలని ట్రయల్స్ చేస్తుంది లీలా (మృణాళిని రవి). తాతయ్య పోవడంతో ఇంటికి వెళుతుంది. 

లీలాను చూసి అరవింద్ (విజయ్ ఆంటోనీ) ప్రేమలో పడతాడు. ఆ విషయం తెలిసి తల్లిదండ్రులు సంబంధం మాట్లాడతారు.

పెళ్లయ్యాక భర్తకు లీలా తన విషయం చెబుతుంది. విడాకులు ఇస్తానని స్పష్టం చేస్తుంది. అరవింద్ షాక్ తింటాడు. 

లీలా కోసం అరవింద్ నిర్మాతగా, హీరోగా మారతాడు. షూట్‌లో ఏం జరిగింది? భర్త మీద భార్యకు ప్రేమ కలిగిందా? అనేది సినిమా.

ఎలా ఉంది?: షారుఖ్ 'రబ్ నే బనాదీ జోడీ' పాయింట్ తీసుకుని కొత్త క్యారెక్టర్లు, సీన్లతో 'లవ్ గురు' తీశారు.

స్టోరీ, స్క్రీన్ ప్లే ప్రెడిక్ట్ చేయడం ప్రేక్షకులకు కష్టం కాదు. దాంతో సర్‌ప్రైజ్‌లు ఏం ఉండవు.

విజయ్ ఆంటోనీ పాటల్లో డ్యాన్స్ చేశారు. సెల్ఫ్ సెటైర్స్ డైలాగ్స్ యాక్సెప్ట్ చేశారు. ఆయనకు టైలర్ మేడ్ రోల్ అని చెప్పొచ్చు.  

కథ, కథనం కంటే 'లవ్ గురు'లో కామెడీ సీన్లు హిలేరియస్ ఉన్నాయ్. ముఖ్యంగా షూటింగ్ సీన్స్ అన్నీ పేలాయి. 

కామెడీ కోసం... వీకెండ్ ఒకసారి సరదాగా నవ్వుకోవడం కోసం 'లవ్ గురు'కు వెళ్లొచ్చు. అంతకు మించి ఆశించొద్దు.