సినిమా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన క్రైమ్ కామెడీ డ్రామా 'పారిజాత పర్వం'. ఇందులో ప్లస్, మైనస్‌లు ఏంటి? హైలైట్స్ ఏంటి?

కథ: బార్ శ్రీను (సునీల్) రియల్ లైఫ్ స్ఫూర్తితో కథ రాసుకుని దర్శకుడిగా ట్రయల్స్ చేస్తుంటాడు చైతు (చైతన్య రావు).

స్నేహితుడు (వైవా హర్ష) హీరో అయితేనే సినిమా చేస్తానని చైతు మొండిపట్టు పట్టడంతో నిర్మాతలు మొహం చాటేస్తారు.

దాంతో సొంతంగా సినిమా తీయాలని కిడ్నాప్ చేయడానికి వెళ్తాడు చైతు. అక్కడికి శ్రీను మనుషులు ఎందుకు వచ్చారు?

శెట్టి భార్యను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎవరు ఎవర్ని కిడ్నాప్ చేశారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ: మూవీ బ్యాక్‌డ్రాప్‌ సెలెక్ట్ చేసుకోవడం వల్ల 'పారిజాత పర్వం'కు కొత్త కలరింగ్ వచ్చింది.

'పారిజాత పర్వం' దర్శకుడు ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ బావుంది. కానీ, తీసిన తీరు ఆకట్టుకునేలా లేదు.

వైవా హర్ష కామెడీ, సునీల్ సీన్లు తప్ప మిగతా సినిమాలో ఎంగేజ్ చేసే, ఎంటర్‌టైన్ చేసే ఎలిమెంట్స్ లేవు.

రెండు గంటల వినోదం ఇవ్వడంలో 'పారిజాత పర్వం' ఫెయిలైంది. థియేటర్లలో డిజప్పాయింట్ చేస్తుంది.