సుందర్ సి, తమన్నా, రాశీల హారర్ కామెడీ 'బాక్' హిట్టా? ఫట్టా? అరణ్మణై ఫ్రాంచైజీలో నాలుగో మూవీ ఎలా ఉందంటే?

కథ: చెల్లెలు శ్రీనిధి (తమన్నా), బావ ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి ఆమె ఊరికి శివశంకర్ (సుందర్ సి) వెళతాడు.

ఆ ఊరిలో పదేళ్లకు జరిగే తిరునాళ్ల టైంలో జన్మించిన వాళ్లను 'బాక్' అనే క్షుద్ర శక్తి చంపడానికి చూస్తుంది.

బాక్ టార్గెట్ లిస్టులో ఉన్న మేనకోడల్ని శివశంకర్ ఎలా కాపాడాడు? నిజంగా అతడి చెల్లెలు ఆత్మహత్య చేసుకుందా?

శ్రీనిధిది ఆత్మహత్యేనా? లేదంటే మరో కారణమా? క్షుద్ర శక్తి vs దైవ శక్తిలో విజయం ఎవరిది? అనేది సినిమా. 

ఎలా ఉంది?: రొటీన్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కథతో తెరకెక్కిన మూవీ 'బాక్'. కథలో కాస్త కూడా కొత్తదనం లేదు.

'అరణ్మణై' ఫ్రాంచైజీ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ తీసిన చిత్రమిది. కామెడీలో తమిళ అతి తెలుగు జనాలకు నచ్చదు.

టెక్నికల్‌గా సినిమా డీసెంట్ స్టాండర్డ్స్‌లో ఉంది. హిప్ హాప్ తమిళ రీ రికార్డింగ్ బాగా చేశారు. వీఎఫ్ఎక్స్ కూడా ఓకే.

ఆర్టిస్టులు అందరూ పాత్రలకు తగ్గట్టు చేశారు. ఛాలెంజింగ్ సీన్లు లేవు. క్లైమాక్స్ అయ్యాక పాటలో తమన్నా, రాశీ గ్లామర్ ట్రీట్ ఇచ్చారు.

రొటీన్ హారర్ సినిమా 'బాక్'. థ్రిల్స్ ఓకే. బట్, కామెడీ నాట్ ఓకే. ఓన్లీ ఫర్ 'అరణ్మణై' ఫ్యాన్స్.