అల్లరి నరేష్ హీరోగా పెళ్లి కానీ యువత సమస్యలు, మాట్రిమోని మోసాలపై తీసిన 'ఆ ఒక్కటి అడక్కు' ఎలా ఉందో చూడండి.

కథ: గణపతి (అల్లరి నరేష్) 50 సంబంధాలు చూస్తాడు. కానీ, ఒక్క అమ్మాయికి కూడా నచ్చడు. అతడిని రిజెక్ట్ చేస్తారు. 

మాట్రిమోని ద్వారా పరిచయమైన సిద్ధి (ఫరియా అబ్దుల్లా)తో ప్రేమలో పడతాడు. మనకి సెట్ కాదని రిజక్ట్ చేస్తుంది.

గణపతి ఇంటికొచ్చి ప్రేమలో ఉన్నామని చెబుతుంది. ఎందుకు? పెళ్లి పేరుతో సిద్ధి మోసాలు చేసిందని ఎందుకు వార్తలొచ్చాయి?

సిద్ధి నిజంగా మోసాలు చేసిందా? ఆమెపై ఫేక్ పెళ్లి కూతురు ముద్ర ఎందుకు పడింది? చివరకు గణపతి ఏం చేశాడు? అనేది మూవీ.

ఎలా ఉంది?: పెళ్లి కాని యువకులకు, వాళ్లకు సంబంధాలు చూస్తున్న తల్లి దండ్రులకు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ 'ఆ ఒక్కటీ అడక్కు'.

కొత్త కాన్సెప్ట్‌తో వార్తల్లో పెళ్లి మోసాలను చూపిస్తూ రొటీన్ ఓల్డ్ సీన్లు రాసి తీశారు దర్శకుడు మల్లి అంకం.

నరేష్ నటన ఓకే. అతడితో ఫరియా అబ్దుల్లా పెయిర్ కూడా! మంచి మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు.

ఆర్టిస్టులకు సరైన కామెడీ సీన్లు పడలేదు. మాట్రిమోని మోసాలపై డిస్కషన్ బోర్. దానికి తోడు పాటలు బాలేదు.

ఆ ఒక్కటీ అడక్కు... ఈ సినిమాలో కామెడీ తక్కువ. రొటీన్ ఎమోషనల్ డ్రామా ఎక్కువ. డిజప్పాయింట్ చేస్తుంది.

Thanks for Reading. UP NEXT

విశాల్ 'రత్నం' రివ్యూ: ప్లస్, మైనస్‌లు ఏంటి? ఎలా ఉందీ యాక్షన్ ఫిల్మ్?

View next story