అన్వేషించండి

Namrata: అభిమానులకు చేతులెత్తి మొక్కిన మహేష్ బాబు - నమ్రతా ఆసక్తికర కామెంట్స్

Namrata: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో అట్టహాసంగా జరిగింది.

Namrata Shirodkar Thanks To Mahesh Babu Fans:  మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా నిర్వహించారు. చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేసింది. మహేష్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

మహేష్ అభిమానులకు నమ్రత కృతజ్ఞతలు

ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ బాబు, అభిమానులపై తన ప్రేమను బయటపెట్టుకున్నారు. అభిమానులే తనకు అన్నీ అన్నారు. “పాతికేళ్ల నా సినీ కెరీర్ లో మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఏటా ఆ అభిమానం పెరుగుతూనే ఉంది. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేను. సంక్రాంతి మాకు కలిసి వచ్చిన పండగ. ఈ పండగకు సినిమా విడుదల అయ్యిందంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతుంది. మా నాన్న లేరు. అమ్మ లేరు. ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మ, నాన్న.. అన్నీ. మీ ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.  ఈ సందర్భంగా అభిమానులందరికీ చేతులు పైకెత్తి దండం పెట్టారు. మహేష్ బాబుకు ఫ్యాన్స్ కూడా తిరిగి ఆయన మాదిరిగానే దండం పెట్టారు. ఈ ఫోటోలను మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఫ్యాన్స్ అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. మున్ముందు రాబోయే వాటికి ఇది ప్రారంభం మాత్రమేనని తెలిపారు. గుంటూరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరి ప్రేమకు కృజ్ఞతలు తెలిపారు. ఈ ప్రేమ, అభిమానం ఇలాగే ఉండాలని ఆమె కోరకున్నారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

టార్గెట్ హ్యాట్రిక్ హిట్!

ఇక ఇప్పటికే 'అతడు', 'ఖలేజా' సినిమాతో మంచి విజయాలను అందుకున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పుడు 'గుంటూరు కారం' విడుదల కాబోతోంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో ఎప్పులేని రీతిలో మహేష్ ను త్రివిక్రమ్ ఈ సినిమా చూపించబోతున్నారు.ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మించగా, తమన్‌ తన మార్క్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేయబోతున్నారు. 

Read Also: OMG 2ను సెన్సార్ బోర్డు చంపేసింది, ఆర్థికంగా దెబ్బకొట్టింది, దర్శకుడు అమిత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget