Amit Rai: OMG 2ను సెన్సార్ బోర్డు చంపేసింది, ఆర్థికంగా దెబ్బకొట్టింది, దర్శకుడు అమిత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
Amit Rai: ‘OMG 2‘ సినిమా గురించి దర్శకుడు అమిత్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ బోర్డు కారణంగానే సినిమా తమ సినిమా చచ్చిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
OMG 2 director Amit Rai Serious Comments On Censor board: అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలల్లో తెరకెక్కిన చిత్రం ‘OMG 2’. అమిత్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత ఏడాది ఆగష్టు 11న విడుదలైంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా విడుదలకు ముందు చాలా వివాదాలకు కారణం అయ్యింది. ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు నిర్ణయాలు సైతం సంచలనంగా మారాయి. బోలెడు వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 221 కోట్లు వసూళు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు అమిత్ రాయ్, ‘OMG 2’ సినిమాకు సెన్సార్ బోర్డు తీరని అన్యాయం చేసిందని వ్యాఖ్యనించారు. సెన్సార్ సభ్యులు తమ సినిమాను చంపేశారంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు.
సెన్సార్ బోర్డు దారుణంగా వ్యవహరించింది- అమిత్ రాయ్
“సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యులు ‘OMG 2’ సినిమా విషయంలో దారుణంగా వ్యవహరించారు. పెద్ద మొత్తంలో ఈ సినిమా సన్నివేశాలను కట్ చేశారు. చిరవరకు A-రేటింగ్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను కోరుకున్న రీతిలో సినిమాను తెరకెక్కించగలిగాను. కానీ, సెన్సార్ బోర్డు నన్ను డిమోటివేట్ చేసింది. కానీ, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్నివర్గాలు, అన్ని వయసుల ప్రేక్షకులు చూశారు. మంచి రివ్యూలు ఇచ్చారు. మేం చెప్పాలి అనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు చెప్పడంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాం” అన్నారు.
‘గదర్ 2’ వసూళ్లను బ్రేక్ చేసే వాళ్లం- అమిత్ రాయ్
oh my god 2 vs gadar 2: ఆగష్టు 11న ‘OMG 2’తో పాటు ‘గదర్ 2’ విడుదలైంది. రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ‘గదర్ 2’ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా రూ. 691 కోట్లు వసూలు చేసింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎన్ని సినిమాలు విడుదలైనా ఆదరిస్తారనే విషయం ఈ రెండు సినిమాలతో వెల్లడైందని అమిత్ తెలిపారు. “‘OMG 2’ సినిమాకు A-సర్టిఫికేట్ ఇవ్వకపోతే, మా సినిమా మంచి వసూళ్లను సాధించేది. బహుశా ‘గదర్2’ వసూళ్లతో పోటీ పడేవాళ్లం. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా కంటే ఎక్కువ వసూళ్లను సాధించే వాళ్లం. సెన్సార్ బోర్డు నా సినిమాకు A-రేటింగ్ ఇచ్చి సంగం చంపేశారు. సెన్సార్ బోర్డ్ నన్ను ఆర్థికంగానూ, కంటెంట్ పరంగానూ దెబ్బతీసింది” అని అమిత్ రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్లు అమిత్ రాయ్ తెలిపారు. 2023 తనకు ఎన్నో పాఠాలను నేర్పిందన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. సినిమాల విషయంలో బాగా పోటీ తత్వం పెరిగిపోయిందన్న ఆయన, మరింత నాణ్యతో కూడిన సినిమాలకే ఆదరణ ఉండబోతుందన్నారు. ఆ దిశగా తను అడుగులు వేయబోతున్నట్లు తెలిపారు.
Read Also: హీరోయిన్ అసిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె భర్త ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం