Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
SCR: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరిన్ని సర్వీసులు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. డిసెంబర్ 11 నుంచి జనవరి 29 వరకూ ఈ సర్వీసులు నడపనున్నారు.
SCR Special Trains To Sabarimala: శబరిమల (Sabarimala) అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే 64 ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి మరో 28 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మౌలాలి నుంచి కొల్లం, కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్ నుంచి కొల్లం, నర్సాపూర్ నుంచి కొల్లం వరకూ ఈ రైళ్లు నడపనున్నారు. డిసెంబర్ 11 నుంచి జనవరి 29 వరకూ నిర్ణీత తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులందించనున్నాయి. ఈ రైళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ శుక్రవారం (డిసెంబర్ 6) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.
రైళ్ల వివరాలు ఇవే..
SCR runs 28 train services for #Sabarimala pilgrims @drmsecunderabad pic.twitter.com/avM3DT7mEm
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2024
- డిసెంబర్ 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైలు (రైలు నెం. 07193) మౌలాలి నుంచి కొల్లం, కొల్లం నుంచి మౌలాలి వరకూ ప్రత్యేక సర్వీసు (రైలు నెం. 07194) డిసెంబర్ 13, 20, 27 తేదీల్లో నడపనున్నారు.
- డిసెంబర్ 14, 21, 28 తేదీల్లో ప్రత్యేక సర్వీసు (రైలు నెం 07149) మౌలాలి నుంచి కొల్లం వరకూ, డిసెంబర్ 16, 23, 30 తేదీల్లో (రైలు నెం. 07150) నడపనున్నారు.
- జనవరి 2, 9, 16, 23 తేదీల్లో రైలు నెం. 07151 కాచిగూడ నుంచి కొట్టాయం వరకూ.. జనవరి 3, 10, 17, 24 వరకూ రైలు నెం 07152 కొట్టాయం నుంచి కాచిగూడ వరకూ రైలు నడవనుంది.
- జనవరి 6, 13 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి రైలు నెం. 07155.. జనవరి 8, 15 తేదీల్లో రైలు నెం. 07156 వరకూ నడపనున్నారు.
- జనవరి 20, 27 తేదీల్లో నర్సాపూర్ నుంచి కొల్లం వరకూ రైలు నెం. 07157.. కొల్లం నుంచి నర్సాపూర్ వరకూ జనవరి 22, 29 తేదీల్లో రైలు నెం.07158 సర్వీస్ నడవనుంది.
సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
మరోవైపు, పండుగల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి విశాఖ, ఒడిశా బ్రహ్మపురకు ప్రత్యేక రైళ్లు నడపనుంది. డిసెంబర్ 6 నుంచి 30వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే నడపనున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖ రైలు (రైలు నెం. 07097) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అలాగే, డిసెంబర్ 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 7.50 గంటలకు విశాఖ నుంచి రైలు (నెం. 07098) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో రెండు మార్గాల్లోనూ ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
అలాగే, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని బ్రహ్మపురకు రైలు (నెం. 07027) శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు బ్రహ్మపురకు రైలు చేరుకుంటుంది. అలాగే, డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో బ్రహ్మపుర నుంచి రైలు (నెం. 07028) శనివారం సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని ద.మ రైల్వే తెలిపింది.
Also Read: PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు