అన్వేషించండి

PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు

Andhra News: శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్‌వీ సీ59 రాకెట్ గురువారం సాయంత్రం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈఎస్ఏకు చెందిన ప్రోబా 3 ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది.

ISRO Successfully Launched PSLV C59 Rocket: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి పీఎస్ఎల్వీ సీ59 (PSLV C59) వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4:04 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ కక్ష్యలోకి ప్రవేశించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా - 3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ఇస్రో (ISRO) ప్రయోగించింది. 550 కిలోల బరువున్న ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. సూర్యుని బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధన చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ తరహా ప్రయోగం చేపట్టడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. కాగా, బుధవారం ఈ ప్రయోగం నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో గురువారానికి వాయిదా పడింది.

శాస్త్రవేత్తల హర్షం

పీఎస్ఎల్‌వీ సీ59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ హర్షం వ్యక్తం చేస్తూ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రోబా - 3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామన్నారు. అలాగే, ప్రోబా తదుపరి చేపట్టబోయే ప్రయోగాలను ఆయన విషెష్ చెప్పారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని.. పీఎస్ఎల్‌వీకి మరిన్ని అవకాశాలు కల్పించిన ఎన్ఎస్ఐఎల్‌కు ధన్యవాదాలు తెలిపారు. డిసెంబరులో స్పేటెక్స్ పేరుతో పీఎస్ఎల్‌వీ - సీ60 ప్రయోగం ఉంటుందని చెప్పారు. ఈ ఉపగ్రహంతోనే ఆదిత్య ఎల్ - 1 సోలార్ మిషన్ కొనసాగుతుందన్నారు.

అసలేంటీ ప్రయోగం..?

ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా 3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పీఎస్ఎల్‌వీ - సీ59 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. సూర్యుని బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధన చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం కాగా.. కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ప్రోబా 3 మిషన్‌లో కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, ఆక్యుల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఉన్నాయి. ఈ 2 ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరించనున్నాయి. ఈ ఉపగ్రహాలు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టిస్తాయి. తద్వారా సూర్యుని బయటి పొర.. కరోనాను అధ్యయనం చేస్తాయి.

Also Read: Andhra Teacher MLC: ఏపీలో సైలెంట్‌గా పూర్తయిన ఎమ్మెల్సీ ఎన్నికలు - ప్రధాన పార్టీలు మాత్రం దూరం !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
iPhone Discounts: ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
Anantha Sriram: 'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
WhatsApp Multiple Account Feature: ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
Embed widget