అన్వేషించండి

Andhra Teacher MLC: ఏపీలో సైలెంట్‌గా పూర్తయిన ఎమ్మెల్సీ ఎన్నికలు - ప్రధాన పార్టీలు మాత్రం దూరం !

Teacher MLC: ఏపీలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉపాధ్యాయ సంఘాలు, స్వతంత్రులు మాత్రమే పోటీ చేశారు.

Teacher MLC elections of both Godavari districts in AP were held peacefully :  భయగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  ఉదయం ఎనిమిది గంటలనుంచి ప్రారంభమైన ఎన్నికల పోలీంగ్‌ ప్రక్రియ అంతా సజావుగానే సాగుతోంది.. ఉభయగోదావరి జిల్లా పరిధిలో కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఈ పోలిగ్ జరిగింది.  ప్రతీ మండల కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రతీ కేంద్రం వద్ద 144సెక్షన్‌ అమలు చేశారు అధికారులు. 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం బరిలో ఐదుగురు ! 

ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి అయిదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గంథం నారాయణరావుకు ఒకటి, దీపక్‌ పులుగుకు రెండు, డాక్టర్‌ నాగేశ్వరరావు కవలకు మూడు, నామన వెంకటలక్ష్మి(విళ్ల లక్ష్మి)కు నాలుగు, బర్రా గోపీమూర్తికి అయిదవ సంఖ్యను కేటాయించారు.  బ్యాలెట్‌ విధానంలో ఈ ఎన్నికలు జరిగాయి.  ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటును నెంబర్‌ రూపంలో వేయాల్సి ఉంది. అభ్యర్ధి పేరు ఎదురుగా ఉన్న గడిలో ప్రాధాన్యత సంఖ్య ఒకటి తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది.. లేకపోతే అది చెల్లదు.  

Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 116    

ఉభయగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎన్నికలకు సంబందించి మొత్తం 116 పోలీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 113 మండలాల పరిధిలో 116 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిని రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖ భవనాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక కాకినాడ, రాజమండ్రి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై.రామవరంలో అదనంగా మొత్తం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 580 మంది విధులు నిర్వర్తించారు.                                     

జిల్లాల వారీగా ఓటర్లు 16,737 మంది.. 

ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి జిల్లాలో 16,737 మంది ఓటర్లు ఉన్నారు. కాకినాడ జిల్లాలో 3,418, అంబేడ్కర్‌ కోనీసీమ జిల్లాలో 3,296, తూర్పుగోదావరి జిల్లాలో 2,990, పశ్చిమ గోదావరి జిల్లాలో 3,729, ఏలూరు జిల్లాలో 2,667, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 637 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు కోసం ఉత్సాహం చూపించారు. పదిహేను వేల మంది వరకూ ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. 

Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు

ఉపాధ్యయ ఎమ్మెల్సీ కావడంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.  ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహించే వారికి సహజంగా గెలుపు వస్తుంది. గతంలో  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయ సంఘాల ఎమ్మెల్సీ పదవి కూడా పోటీ చేసేవారు. కానీ ఈ సారి పోటీ పెట్టలేదు.      

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Pushpa 2 Leaked: 'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Pushpa 2 Leaked: 'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి త్వరలో ఫ్రీగా వాహనాలు, తొలి ప్రాధాన్యం ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి త్వరలో ఫ్రీగా వాహనాలు, తొలి ప్రాధాన్యం ఎవరికంటే?
Padi Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
Pushpa 2: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
Uber: టైమ్‌కు రాలేదని ఉబెర్‌ను కోర్టుకు లాగిన కస్టమర్ - అంతేనా రూ.54వేల పరిహారం కూడా పొందాడు !
టైమ్‌కు రాలేదని ఉబెర్‌ను కోర్టుకు లాగిన కస్టమర్ - అంతేనా రూ.54వేల పరిహారం కూడా పొందాడు !
Embed widget