సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతి
ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌లోని సంధ్య 70MM థియేటర్‌కి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలోనే గేట్‌లోపలికి ఫ్యాన్స్ చొచ్చుకు రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దిల్‌షుక్‌నగర్‌కి చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై అందరిపైనా లాఠీ ఛార్జ్ చేశారు. ఆ మహిళకి, చిన్నారికి సీపీఆర్ చేశారు. ఆ తరవాత హాస్పిటల్‌కి తరలించారు. అయితే...ఆ మహిళ అప్పటికే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల బేగంపేట కిమ్స్‌కి తరలించారు. దేశ్‌ముఖ్ హాస్పిటల్‌లో చేర్చినప్పటికీ...వైద్యులు చనిపోయిందని డిక్లేర్ చేయడంతో అక్కడి నుంచి గాంధీ మార్చురీకి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యం కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఇప్పటికే వివాదాస్పదమైంది. కనీసం భద్రత కల్పించకుండా పోలీసులు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చిన్నారికి సీపీఆర్ చేసిన వీడియో ఇప్పటికే వైరల్ అవుతోంది. ఈ వివాదంపై అల్లు అర్జున్ స్పందించే అవకాశాలున్నాయి.