ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీఐతో ఆయన వాగ్వాదానికి దిగగా...సీఐ ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆయన నివాసానికి వచ్చి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతించలేదు. ఆయననీ అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కౌశిక్ రెడ్డితో పాటు ఆయన ఇంటికి వెళ్లిన మరో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస అరెస్ట్‌లతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇది ప్రజా పాలన కాదని, నియంతృత్వ పాలన అని బీఆర్ఎస్ కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. హరీశ్ రావుని అరెస్ట్ చేసి గచ్చి బౌలికి తరలించడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. విడిచిపెట్టాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.