బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లగా అక్కడే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో హరీశ్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు ఆయనకు మధ్య చిన్న ఘర్షణ జరిగింది. కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల భారీగా మొహరించారు. తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారని, కేసు పెట్టాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కాసేపు హడావుడి చేశారు కౌశిక్ రెడ్డి. సీఐ తనని సరిగా రిసీవ్ చేసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ స్టేషన్ ఎదురుగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అక్రమ అరెస్ట్‌లు ఆపాలని నినాదాలు చేశారు. సీఎం రేవంత్ నియంతలా పాలిస్తున్నారని మండి పడుతున్నారు.