అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

This Week Releases: ఈవారం థియేటర్లు, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు - ఒక్కొక్కటి ఒక్కో జోనర్

This Week Releases: ఈవారం థియేటర్లలో విడుదల అవుతున్న మూడు సినిమాల్లో ఒక్కొక్కటి ఒక్కో భాష, ఒక్కొక్కటి ఒక్కో జోనర్‌లో ఉన్నాయి. ‘టిల్లు స్క్వేర్’ కూడా ఈవారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

This Week Releases In Theaters And OTT: ఏప్రిల్ చివరి వారంలో థియేటర్లలో ఒక తెలుగు, ఒక తమిళ, ఒక హిందీ చిత్రం కలిసి వస్తున్నాయి. కానీ ఈ మూడింటిలో ఏ ఒక్క సినిమాకు కూడా ప్రేక్షకుల్లో ఎక్కువగా హైప్ కనిపించడం లేదు. అలాగే ఓటీటీలో కూడా ఈ వారం సినిమా సందడి కాస్త తక్కువగానే కనిపిస్తోంది. ‘టిల్లు స్క్వేర్’ తప్పా ఓటీటీ వ్యూయర్స్‌ను ఎంటర్‌టైన్ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా సంఖ్యలో విడుదల కావడం లేదు. ఇక ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ సినిమాలు విడుదల అవుతున్నాయో చూసేయండి..

పొలిటికల్ థ్రిల్లర్..

చాలాకాలం తర్వాత తనకు బాగా నచ్చిన పొలిటికల్ డ్రామా జోనర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చేస్తున్నాడు నారా రోహిత్. పదేళ్ల క్రితం విడుదలయిన ‘ప్రతినిధి’కి సీక్వెల్ అయిన ‘ప్రతినిధి 2’తో ఏప్రిల్ 25న థియేటర్లలో సందడి చేయనున్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో నారా రోహిత్‌కు జంటగా సిరి లెల్లా నటించింది. ఇప్పటికే విడుదలయిన ‘ప్రతినిధి 2’ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారు ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ఎదురుచూస్తున్నారు.

తమిళంతో పాటు తెలుగులో..

విశాల్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రత్నం’ కూడా ఈవారం ‘ప్రతినిధి 2’కు పోటీగా రంగంలోకి దిగనుంది. విశాల్ ఇతర చిత్రాలలాగానే ‘రత్నం’ కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతోంది. హరి దర్శకత్వంలో ఈ హీరోకు ఎన్నో యాక్షన్ హిట్స్ లభించాయి. మరోసారి తనతోనే చేతులు కలిపి ‘రత్నం’ చేశాడు విశాల్. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ‘ప్రతినిధి 2’ విడుదలయిన ఒక్కరోజు తర్వాత.. అంటే ఏప్రిల్ 26న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ‘రత్నం’ను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడానికి విశాల్.. విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నా మూవీకి కావాల్సిన హైప్ మాత్రం కనిపించడం లేదు.

హైప్ లేని హిందీ చిత్రం..

‘రత్నం’ విడుదల అవుతున్న అదే రోజు.. ఒక బాలీవుడ్ మూవీ కూడా రిలీజ్‌కు సిద్ధమయ్యింది. అదే ‘రుస్లాన్’. కరణ్ బి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఆయుష్ శర్మ, సుశ్రీ మిశ్రా హీరోహీరోయిన్లుగా నటించారు. టాలీవుడ్ యాక్టర్ జగపతి బాబు.. ఇందులో కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 26న విడుదల కానున్న ‘రుస్లాన్’కు బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా పెద్దగా హైప్ కనిపించడం లేదు.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్

డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 25

టిల్లు స్క్వేర్ (తెలుగు సినిమా) - ఏప్రిల్ 26

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

భీమా (తెలుగు సినిమా) - ఏప్రిల్ 25

క్రాక్ (హిందీ సినిమా) - ఏప్రిల్ 26

అమెజాన్ ప్రైమ్

దిల్ దోస్తీ డైలమా (హిందీ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 25

జియో సినిమా

ది జెనెక్స్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 22

యాపిల్ టీవీ

ది బిగ్ డోర్ ప్రైజ్ 2 (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 24

లయన్స్ గేట్ ప్లే

ది బీ కీపర్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 26

బుక్ మై షో

కుంగ్ఫూ పాండా 4 (యానిమేషన్ సినిమా) - ఏప్రిల్ 26

Also Read: 'బ్యూటీ' - మారుతి టీమ్ నుంచి మరో యూత్‌ఫుల్ సినిమా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Aditi Shankar: పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Aditi Shankar: పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Karthika Vanabhojanam 2024: కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
Amla Soup : చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తిని పెంచే సూప్.. సింపుల్ రెసిపీ, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్
చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తిని పెంచే సూప్.. సింపుల్ రెసిపీ, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్
Embed widget