అన్వేషించండి

Meal Plan : ఆరోగ్య ప్రయోజనాలకై, బరువు తగ్గడం కోసం 14 రోజులు ఈ డైట్​ ఫాలో అయిపోండి.. మీల్ ప్లాన్ ఇదే

Balanced Diet : సమతుల్య ఆహారం తీసుకుంటే బరువు తగ్గడం నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. మరి ఈ బ్యాలెన్స్డ్​ డైట్​ని ఎలా తీసుకోవాలో.. ఇప్పుడు మీల్​ ప్లాన్​ ద్వారా చూసేద్దాం.

Balanced Meal Plan for 14 Days : హెల్తీ ఫుడ్ హెల్తీ లైఫ్​ని ప్రమోట్ చేస్తుంది. అందుకే శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు అందించాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. హెల్తీ ఫుడ్ తీసుకోవడం అంటే డైట్​ నుంచి పూర్తిగా కొన్ని పదార్థాలు తీసేయాలి.. కొన్ని పదార్థాలు యాడ్ చేయడం కాదు. అన్నింటినీ సమానంగా శరీరానికి అందించడం. అందుకే సమతుల్యమైన డైట్​ని ఫాలో అవ్వాలని అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఈ బ్యాలెన్స్డ్​ డైట్​ని ఎలా ఫాలో అవ్వాలో.. 14 రోజుల మీల్ ప్లాన్ ద్వారా చూసేయండి.

బ్యాలెన్డ్స్ డైట్​ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు.. బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహం, అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు ఉన్నవారు కూడా ఫాలో అవ్వొచ్చు. ఈ మొత్తం 14 రోజుల డైట్​ ప్లాన్ 2000కేలరీలతో ఉంటుంది. బ్రేక్​ఫాస్ట్ నుంచి డిన్నర్​ వరకు ఎలాంటి ఫుడ్స్, ఏయే క్వాంటిటీలో తినాలో ఇప్పుడు చూసేద్దాం. 

ఉదయాన్నే తీసుకోవాల్సిన ఫుడ్స్, లాభాలు

తెల్లారుజామునే ముందుగా ద్రాక్షలు తీసుకోవచ్చు. వీటిని ఓ కప్పు తీసుకుంటే 140 కేలరీలు ఉంటాయి. వీటిలో కార్బ్స్ 33 గ్రాములు, ప్రోటీన్ 1 గ్రాము, ఫ్యాట్స్ 0.6 గ్రాములు, ఫైబర్ 5.8 గ్రాములు ఉంటాయి. ఈ ద్రాక్షల్లో ఫైబర్, పొటాషియం, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ సమస్యలను దూరం చేస్తాయి. కంటి సమస్యలను, గుండె సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీక్యాన్సర్, యాంటీమైక్రోబయాల్, యాంటీవైరల్, కార్డియోప్రొటెక్టివ్, న్యూరోప్రొటెక్టివ్, హైపాటోప్రొటెక్టివ్ లక్షణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి డేని వీటితో ప్రారంభిస్తే మంచిది. 

బ్రేక్​ఫాస్ట్​గా.. 

ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా ఓట్స్ ఉమ్మ తీసుకోవచ్చు. ఓట్స్ 50 గ్రాములు, గోధుమరవ్వ 10 గ్రాములు, టోమాటో 40 గ్రాములు, క్యారెట్ 30 గ్రాములు, పచ్చిమిర్చి 3, క్యాప్సికమ్ 20 గ్రాములు, నూనె 1 టీస్పూన్, ఉప్పు రుచికి తగినంత వేసుకుని దీనిని తయారు చేసుకోవాలి. దీనిని ఓ కప్పు తీసుకుంటే 316 కేలరీలు శరీరానికి అందుతాయి. కార్బ్స్ 49 గ్రాములు, ప్రొటీన్ 13 గ్రాములు, ఫ్యాట్స్ 7.6 గ్రాములు, ఫైబర్ 3.3 గ్రాములు దీనిలో ఉంటాయి. ఓట్స్​లో మాంగనీస్, ఫాస్పరస్ ఉంటుంది. అంతేకాకుండా బయోటిన్, విటమిన్ బి1, మెగ్నీషియం, డైటరీ ఫైబర్, జింక్, ప్రొటీన్ లభిస్తుంది. 

స్నాక్​గా.. 

ఎగ్ వైట్స్ 2 తీసుకుని దానిపై కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసి ఆమ్లెట్​గా వేసి తినొచ్చు. దీనిలో 28 కేలరీలు ఉంటాయి. ప్రొటీన్ 7 గ్రాములు అందుతుంది. లో కేలరీ, ఫ్యాట్ ఫ్రీ ఫుడ్​ కోసం దీనిని తీసుకోవచ్చు. 

మధ్యాహ్న భోజనం

రాజ్మా పులావ్ లంచ్​లో తీసుకోవచ్చు. బియ్యం 100 గ్రాములు, రాజ్మ 50 గ్రాములు ఉల్లిపాయ, టమోటో 40 గ్రాములు, పచ్చిమర్చి 3, అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, క్యాప్సికమ్ 50 గ్రాములు, కొత్తిమీర, పుదీనా, నెయ్యి లేదా నూనె రెండు టీస్పూన్లు, ఉప్పు రుచికి తగినంత వేసి దీనిని తయారు చేసుకోవచ్చు. రాజ్మా పులావ్​ని 1 కప్పు తీసుకుటే 614 కేలరీలు అందుతాయి. వీటిలో కార్బ్స్ 112 గ్రాములు, ప్రొటీన్స్ 20 గ్రాములు, ఫ్యాట్స్ 9.6 గ్రాములు, ఫైబర్ 3.7 గ్రాములు ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. మెటబాలీజం రేట్​ని పెంచి.. బరువు తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్​ని కంట్రోల్​లో ఉండేలా చేస్తుంది. 

లంచ్​లోనే వెజిటేబుల్ రైతా తీసుకోవచ్చు. పెరుగు, ఉల్లిపాయ, టమాటో, కీరదోస, క్యారెట్ తురుము, కొత్తిమీర, జీలకర్రపొడి, రుచికి తగినంత ఉప్పు వేసి దీనిని తయారు చేసుకోవచ్చు. దీనిని ఓ కప్పు తింటే 82 కేలరీలు అందుతాయి. వీటిలో కార్బ్స్ 10.6 గ్రాములు, ప్రొటీన్స్ 5.3 గ్రాములు, ఫ్యాట్స్ 2.1 గ్రాములు, ఫైబర్ 0.7 గ్రాములు ఉంటుంది. ఇది గట్ హెల్త్​కి మంచిది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాల్షియం, విటమిన్ డి అందుతుంది. 

ఈవెనింగ్ స్నాక్స్​గా..

ఓ కప్పు కీరదోస ముక్కల్లో కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లి తీసుకోవ్చచు. దీనిలో కార్బ్స్ 5 గ్రాములు, ప్రొటీన్ 0.8 గ్రాములు ఫ్యాట్స్ 0.2 గ్రాములు, ఫైబర్ 1 గ్రాములు ఉంటుంది. లేదంటే 5 వాల్​నట్స్ నానబెట్టి తినొచ్చు. వీటితో 215 కేలరీలు పొందవచ్చు. కార్బ్స్ 22 గ్రాములు, ప్రొటీన్ 3 గ్రాములు, ఫ్యాట్స్ 12.8 గ్రాములు, ఫైబర్ 0.4 గ్రాములు ఉంటుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడుతాయి. ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ గుండె, బ్రెయిన్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి. 

డిన్నర్​ కోసం

రెండు జొన్నరెట్టెలు తీసుకోవచ్చు. వీటిలో 346 కేలరీలు ఉంటాయి. కార్బ్స్ 72 గ్రాములు, ప్రోటీన్ 10 గ్రాములు, ఫ్యాట్స్ 2 గ్రాములు ఫైబర్ 1.6 గ్రాములు ఉంటాయి. ఇవి గ్లూటెన్ ఫ్రీ. ప్రోటీన్​ కూడా ఎక్కువగా ఉండి.. కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేస్తుంది. 

వాటిలోకి కర్రీగా కాకరకాయను తీసుకోవచ్చు. కాకరకాయ 200 గ్రాములు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 3, 1 టీస్పూన్ ఆయిల్ వేసి కర్రీ చేయాలి. దీనిని ఓ కప్పు తీసుకుంటే 177 కేలరీలు అందుతాయి. ఈ కూరలో 26 గ్రాముల కార్బ్స్, 5 గ్రాముల ప్రొటీన్, 6 గ్రాముల ఫ్యాట్స్, ఫైబర్ 4 గ్రాములు అందుతాయి. దీనోలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి ఇలా చాలా పోషకాలు శరీరానికి అందుతాయి. షుగర్ కంట్రోల్ అవుతుంది. 

పడుకునే ముందు.. 

నిద్రకు ముందు ఓ గ్లాస్ బటర్ మిల్క్ తాగండి. దానిలో ఓ టీస్పూన్ మెంతిగింజల పొడి కూడా వేసుకోండి. దీనిని తాగితే 50 కేలరీలు శరీరానికి అందుతాయి. అంతేకాకుండా 2.8 గ్రాముల కార్బ్స్, 2.9 గ్రాములు ప్రొటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ 0.2 అందుతుంది. దీనిలో కేలరీలు, ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. కావాలంటే జీర, కొత్తిమీర, పుదీనా ఆకులు, నిమ్మరసం కూడా కలిపి తీసుకోవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేస్తుంది. ఇలా మీరు బ్యాలెన్స్డ్​ డైట్​ని ఫాలో అవ్వొచ్చు. దీనిని 14 రోజులు ఫాలో అయితే ఫలితాలు మీరే చేస్తారు. 

Also Read : సమ్మర్​ హీట్​ని బీట్ చేస్తూ.. బరువు తగ్గించడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ ఇవే, వేసవిలో వీటిని ఫాలో అయిపోండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Adilabad Politics: నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
Maharashtra Municipal Election Result: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Politics: నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
Maharashtra Municipal Election Result: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
తొలి ఎలక్ట్రిక్ కారు Urban Cruiser BEV తెస్తున్న టయోటా.. ఒక్క ఛార్జ్‌తో 500 KM రేంజ్
తొలి ఎలక్ట్రిక్ కారు Urban Cruiser BEV తెస్తున్న టయోటా.. ఒక్క ఛార్జ్‌తో 500 KM రేంజ్
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Embed widget