West Godavari Latest News:ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మద్యం షాప్‌లా మారిన ఆక్వా ఫామ్, 180mlతో నర్సాపురం మున్సిపాలిటీ షేక్
West Godavari Latest News: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మద్యం షాపులా మారిపోయిన అక్వా ఫామ్. 180ml లిక్కర్‌తో పెద్ద రాకెట్ గుట్టును పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు లాగారు.

MLC Elections 2025: ఎంఎల్సీ ఎన్నికల వేళ ఓటర్లకు పంచడానికి దాచి ఉంచిన 4500 మందు బాటిలను ఎక్సైజ్ శాఖ పట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అక్రమ మద్యం రాకెట్‌ను భగ్నం చేసినట్టు పశ్చిమ గోదావరి జిల్లా అబ్కారీ, మద్యపానం నియంత్రణ అధికారి డా. కుమరేశన్ తెలిపారు.
ఎన్నికల్లో పంచడం కోసం కోళ్ల ఫారంలో దాచిన 4,500 బాటిళ్ల అక్రమ మద్యాన్ని డిపార్ట్మెంట్ పట్టుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం రవాణాపై దృష్టి సారించారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన దాడుల్లో భారీ పరిమాణంలో అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ముందుగా ఓ వ్యక్తిని రాయల్ గ్రాండ్ మాల్ట్ విస్కీ (180ml) రెండు బాటిళ్లతో అరెస్టు చేశారు.
Also Read: విపక్షంలో ఉన్నప్పుడు పనికొస్తాయి, అధికారంలో ఉన్నప్పుడు కూలుస్తాయి- అసలేంటి స్ట్రాటజీ సంస్థల అసలు కథ
180 ఎంఎల్ పట్టుకోవడంతో కీలక సమాచారం దొరికింది
అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో నర్సాపురం సమీపంలోని ఒక ఆక్వా ఫారంలో దాచిన 4,500 బాటిళ్లకుపైగా నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. దొరికిన అ ఇద్దరు వ్యక్తులను నర్సాపురం మండలంలోని కొప్పర్రు గ్రామానికి చెందిన 35 ఏళ్ల గొల్లమండల రాజబాబు, నర్సాపురం పట్టణానికి చెందిన 42 ఏళ్ల బార్రే జయరాజుగా గుర్తించారు. ప్రస్తుతం అధికారులు ఈ మద్యం రాకెట్‌లో రాజకీయ సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ మద్యం సరఫరా వ్యవహారం నర్సాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ బార్రే వెంకటరమణకు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె భర్త బార్రే జయరాజు ద్వారా ఎన్నికల సమయంలో భారీగా మద్యం నిల్వ చేసినట్లు డిపార్ట్మెంట్ వర్గాలు చెబుతున్నాయి . ఎన్నికల కోసం తీసుకువచ్చిన మద్యం నిల్వల్ని ఇప్పుడు అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు- మీరెవరు అంటూ పోలీసులతో వాగ్వాదం
ఎవరున్నా వదిలేది లేేదంటున్న అధికారులు
పశ్చిమ గోదావరి జిల్లా అబ్కారీ, మద్యపానం నియంత్రణ అధికారి డా. కుమరేశన్ మాట్లాడుతూ ఎంతటి ప్రతిష్ట ఉన్న వ్యక్తులైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల నైతికతను దెబ్బతీసే అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడానికి అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశారు. దాడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను అభినందించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముంది.
కీలకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక్కసారిగా కీలకంగా మారాయి. మొదట్లో దీన్ని తేలిగ్గా తీసుకున్న అధికార కూటమి ఇప్పుడు రాష్ట్రంలో మారిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాలు చేజిక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపున విపక్షాలు సపోర్ట్ చేస్తున్న అభ్యర్థులు సైతం ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడంతో ఏపీలో mlc ఎన్నికల వాతావరణం హీటెక్కింది.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

