అన్వేషించండి

Lingodbhavam Timings in 2025: శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసం చేయలేనివారు... ఈ 40 నిముషాలు కేటాయించండి చాలు!

Maha Shivratri 2025: ఆరోగ్యం బాలేనివారు, గర్భిణిలు...శివరాత్రి రోజంతా ఉపవాసం, జాగరణ చేయాల్సిన చేయలేరు. అయితే ఇలాంటి వారికోసమే ఈ 40 నిముషాలు.. అత్యంత అపురూపం అయిన ఈ  ఆ సమయం ఏంటంటే..

Lingodbhavam Timings in 2025 Date: 2025 ఫిబ్రవరి 26 బుధవారం శివరాత్రి (Maha Shivratri 2025) ఈ రోజు లింగోద్భవ కాలం బుధవారం అర్థరాత్రి 12 గంటల 9 నిముషాల నుంచి 12 గంటల 57 నిముషాల వరకూ.. ఈ రోజు మొత్తం మీద 40 నిముషాల సమయం అత్యంత ముఖ్యమైనది.  

మహా శివరాత్రి రోజు.. భక్తులు రోజంతా ఉపవాసం, జాగరణ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు , గర్భిణులు జాగరణ, ఉపవాసం చేయలేకపోతే బాధపడొద్దు.  లింగోద్భవ సమయాన్ని ప్రత్యేకంగా పాటించండి. లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడిని అర్చించగలిగితే శివరాత్రి మొత్తం చేసిన ఫలితం పొందుతారు. 

లింగోద్భవం ఎందుకంత ప్రత్యేకం అంటే.. బ్రహ్మ-విష్ణు మధ్య నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని పోటీపడతారు. ఆ సమయంలో ఇద్దరి మధ్యలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు శివుడు. ఈ సమయాన్నే లింగోద్భవ సమయం అంటారు. శివరాత్రి మొత్తం ఏం చేసినా చేయకపోయినా లింగోద్భవ సమయం చాలా ముఖ్యం..

Also Read: పరమేశ్వరుడిని మెప్పించే మార్గం ఇదే.. మహాశివరాత్రి రోజు ఆచరించండి!

లింగోద్భవ సమయంలో శివపంచాక్షరి మంత్రం జపించండి, పంచామృతాలతో కానీ, నీటితో కానీ అభిషేకం చేయండి. ఈ లింగోద్భవ సమయం 40 నిముషాలూ శివుడిని ధ్యానించండి. ఈ సమయంలో సృష్టిమొత్తం శివలింగమే అని అర్థం. ఆ సమయంలో శివలింగం పైనుంచి అమృతధార కురుస్తుంది. అంటే విశ్వమంతా శివలింగమే అయినప్పుడు పైనుంచి కురిసే అమృతధార మనపైనుంచి కూడా ధారగా కురుస్తుందని అర్థం. అందుకే లింగోద్భవ సమయం అత్యంత పుణ్య ఫలం అని చెబుతారు పండితులు.

లింగోద్భవ సమయంలో అభిషేకం, అర్చనలు చేయలేకపోయినా శివనామస్మరణ చేసినా చాలు...

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥  

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥  
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥  

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥  

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥  

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥  

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥  

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

Also Read: తేలిక పదాలతో బరువైన శివతత్వాన్ని చూపించిన రామజోగయ్య శాస్త్రి... 'శివా శివా శంకరా' సాంగ్ అందుకే సూపర్ హిట్!

Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
Embed widget