Shruti Haasan: శృతిహాసన్ హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - 'The Eye' ట్రైలర్ చూశారా..?
Shruti Haasan The Eye Trailer: శ్రుతిహాసన్ లీడ్ రోల్‌లో నటించిన బ్రిటీష్ మూవీ 'The Eye' ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీలో శ్రుతి యంగ్ విడో రోల్‌లో కనిపించారు.

Shruti Haasan's Hollywood Movie The Eye Trailer Released: టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ (Shruti Haasan) లీడ్ రోల్‌లో నటిస్తున్న ఫస్ట్ హాలీవుడ్ మూవీ 'The Eye'. డాఫ్నే ష్మోన్ (Daphne Schmon) దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీలో మార్క్ రౌలీ నటించారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. బీచ్‌లో తన భర్తతో గడిపిన మధుర క్షణాలతో కూడిన సీన్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుండగా.. తన భర్త మరణం ఆమెను షాక్‌కు గురిచేస్తుంది. తన భర్త చితభస్మాన్ని నీటిలో కలిపేందుకు తాము గతంలో ఉన్న దీవికి ఆమె వెళ్లగా అక్కడ ఆమెకు ఎదురైన భయానక అనుభవాలు.. తన భర్త మరణం వెనుక మిస్టరీని ఛేదించడంలో ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది.? అనేదే ఈ మూవీ స్టోరీ లైన్ అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఎదురైన భయానక పరిస్థితులు.. మిస్టరీ థ్రిల్లర్‌పై హైప్‌ను పెంచేశాయి. శ్రుతిహాసన్ గతంలో Treadstone అనే హాలీవుడ్ టీవీ సిరీస్‌లో నటించగా.. 'The Eye' ఆమెకు ఫస్ట్ హాలీవుడ్ ఫీచర్ ఫిల్మ్. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ గురువారం ముంబైలోని WENCH ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు.
అటు, తెలుగులో కాకుండా ఇటు హిందీ, తమిళం సినిమాల్లోనూ నటించిన శ్రుతిహాసన్ ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆమె సినిమాల జోరు తగ్గింది. గతేడాది ప్రభాస్ 'సలార్'తో మంచి హిట్ అందుకున్నారు. తాజాగా ఆమె తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'కూలీ'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: పునీత్ రాజ్ కుమార్ ఫస్ట్ మూవీ 'అప్పు' రీ రిలీజ్ - మరోసారి థియేటర్లలోకి బ్లాక్ బస్టర్, ఎప్పుడంటే?





















