Ruturaj gaikwad Century vs SA A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
టీమిండియా లో చోటు కావాలా...ప్రత్యేకించి వన్డేల్లో ఆడాలా అయితే నువ్వు ఆల్ రౌండర్ అవ్వాలి అంటున్నాడు కోచ్ గౌతం గంభీర్. ఆయన ఆలోచనా విధానం అలానే ఉంది. నువ్వు అక్షర్ పటేల్ అయితే చాలు వన్ డౌన్ లో అయినా ఆడిస్తా...నువ్వు అయ్యర్ లా ఓన్లీ బ్యాటర్ వా చెప్పు కనీసం టీమ్ లో ప్లేస్ కూడా డౌటే అన్నట్లుంది వ్యవహారం. టీ20ల్లో ప్రత్యేకించి ఐపీఎల్లో బీభత్సంగా సక్సెస్ అయిన శ్రేయస్ అయ్యర్ సునాయాసంగా టీ20ల నుంచి తప్పించి పెద్ద బ్యాక్ ల్యాష్ ఎదుర్కొన్న గంభీర్...ఆ టార్చర్ తప్పించుకోవటానికి వన్డేల్లో అయ్యర్ కి వైస్ కెప్టెన్సీ ఇచ్చి ప్లేస్ ఇచ్చాడు. అది కూడా ఎక్కడో మిడిల్ ఆర్డర్ లో. పోనీ ఆ ప్లేస్ ఏమైనా కన్ఫర్మ్ ఆ అంటే అది కూడా డౌటే. ఇప్పుడు అది చాలదన్నట్లు ఇంకో కొత్త తలనొప్పి వచ్చి పడింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కి ముందు అనఫీషియల్ గా ఓ వన్డే సిరీస్ పెట్టింది బీసీసీఐ. దానికి చాకచక్యంగా కెప్టెన్ గా తిలక్ వర్మను పెట్టి...రుతురాజ్ గైక్వాడ్ ను నార్మల్ ప్లేయర్ గా పంపింది. వాస్తవానికి గైక్వాడ్ కి కెప్టెన్సీ ఇవ్వాలి. బట్ దానికి చాలా వేరే కారణాలు ఉంటాయి లేండి. రుతు ఏమన్నా తక్కువ వాడా వచ్చిందే ఛాన్స్ కదా. మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. అన్ని అర్హతలు ఉన్నా తనెందుకు టీమిండియాకు ఆడటానికి అర్హుడిని కానని క్వశ్చన్ చేస్తున్నట్లు 129 బంతుల్లో 117పరుగులు చేసి ఛేజింగ్ లో సౌతాఫ్రికా A పై టీమిండియా Aను నాలుగు వికెట్ల తేడాతో గెలిపించాడు. కెప్టెన్ తిలక్ వర్మ 39 రన్స్ తో మంచి ఫినిషింగే ఇచ్చాడు. ఇప్పుడు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో మిగిలి ఉన్న ఆ ఒక్క ప్లేస్ కోసం అయ్యర్ ని తీసుకోవాలా...గైక్వాడ్ ని తీసుకోవాలా...తిలక్ వర్మను ఆడించాలా....ఇప్పుడు అన్నింటికంటే ఇంకో తలనొప్పి కీపర్ రిషభ్ పంత్ గాయం నుంచి కోలుకున్నాడు. సౌతాఫ్రికాతో ఇవాళ్టి నుంచి టెస్ట్ సిరీస్ కూడా ఆడుతున్నాడు. తను స్పెషలిస్ట్ కీపర్ బ్యాటర్ కాబట్టి తన ప్లేస్ తను కోరుకుంటాడు. తను లేనప్పుడు రాహుల్ కీపింగ్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. మరి పంత్ ను తీసుకోవాలా...ఒక్క ప్లేస్ కోసం నలుగురు పోటీపడుతున్న ఈ తలనొప్పి గంభీర్ ను మాత్రం వదిలిపెట్టేలా లేదు.





















