Jubilee Hills By Poll Results 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దూసుకెళ్తోన్న నవీన్ యాదవ్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్! పూర్తిగా సైడైన బీజేపీ
Jubilee Hills By Poll Results 2025 LIVE: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దూకూడు కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కోల్పోతోంది. రౌండ్ల వారీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.

Jubilee Hills By Election 2025 Latest News | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక్కో రౌండ్ లోనూ మెజార్టీ ఓట్లు సాధిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం వైపు దూసుకెళ్తున్నారు. మొదటి రౌండ్లో 99 ఓట్లతో నోటా నాలుగో స్థానంలో నిలిచిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ షేక్ పేట, రహమత్ నగర్, ఎర్రగడ్డలలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. రౌండ్ల వారీగా నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం సాధిస్తుండగా.. కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు మంత్రులు, పార్టీ కీలకనేతలు గాంధీ భవన్‌కు చేరుకుంటున్నారు.
రౌండ్ల వారీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు..
జుబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి- 8911 ఓట్లు వస్తే బీఆర్‌ఎస్‌కు 8864, బీజేపీకి 2167 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి 47 ఓట్ల మెజార్టీని సాధించారు.
రెండో రౌండ్ పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ 2995 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు రెండో రౌండ్ ముగిసేసరికి 17874 ఓట్లు వచ్చాయి. మాగంటి సునీతకు 14,879 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థికి 3475 ఓట్లు పోలయ్యాయి.

మూడో రౌండ్ తరువాత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 6012 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. మూడు రౌండ్‌లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 28, 999 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు 22, 987 ఓట్లు వచ్చాయి. 5361 ఓట్లతో బీజేపీ మూడో స్థానంలో ఉంది.
నాలుగో రౌండ్ లోనూ నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఈ రౌండ్ తరువాత నవీన్ యాదవ్ 9 వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.
ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఐదో రౌండ్‌కు ముగిసే సరికి నవీన్ యాదవ్‌కు 12,651 అధిక్య లభించింది. ఒక్క 5వ రౌండ్‌లో 2000పైగా నవీన్ యాదవ్‌కు లీడ్ వచ్చింది.
ఆరో రౌండ్ తరువాత కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. నవీన్ యాదవ్ 15589 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 6వ రౌండ్‌లో కాంగ్రెస్ - 9553 ఓట్లు, బీఆర్ఎస్ - 6615 ఓట్లు.. ఈ రౌండ్లో కాంగ్రెస్ లీడ్ 2938 సాధించింది.
7 రౌండ్‌లు ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై వేలకుపైగా మెజార్టీతో ఉన్నారు.
8 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23 వేల పైచిలుకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాంతో బీఆర్ఎస్ పుంజుకోవడం కష్టమేనని కనిపిస్తోంది.
ఓవరాల్‌గా నవీన్ యాదవ్ కు 99,120 ఓట్లు రాగా మాగంటి సునీతకు 74,462 ఓట్లు పోలయ్యాయి. దాంతో 24,658 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్..
అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రజా ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టారని, బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందని ప్రజలకు చాటిచెప్పాలని అధికార కాంగ్రెస్ నేతలు భావించారు. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ఇది రిఫరెండంగా ప్రజలు భావిస్తున్నారని చెప్పాలని గులాబీ పార్టీ చూసింది. ప్రస్తుతం జరిగిన రౌండ్లలో కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దాంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే తప్పా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. మరోసారి ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది.






















