Kids Love on YS Jagan | మొన్న గుంటూరులో పాప..నిన్న పులివెందులలో బాబు | ABP Desam
సీఎంగా ఉన్నప్పుడు జగన్ మామయ్య అని చిన్నారులతో ప్రేమగా పిలిపించుకున్న వైఎస్ జగన్..అధికారం లేకున్నా చిన్నారుల మనసులో చోటు అలాగే ఉంచుకోగలుగుతున్నాడు. మొన్నటి మొన్న గుంటూరు లో ఓ చిన్నారి జగన్ కు దగ్గరకు వెళ్లాలని కన్నీళ్లు పెట్టుకుంది. నిన్న పులివెందులలో జగన్ ను చూడాలని కనీసం కాళ్లకు చెప్పులు లేకుండా ఓ పిల్లాడు జగన్ హెలిప్యాడ్ దగ్గర ఏడుస్తూ కనిపించాడు. జగన్ ఆ పిల్లాడిని పలకరించి ఏడవొద్దంటూ కళ్లు తుడిచి ఫోటోలు దిగి పంపించాడు. ఈ రెండు ఘటనలు జగన్ మామయ్య పై పిల్లల ప్రేమను తెలియచేస్తున్నాయి అంటున్నారు వైసీపీ ఫ్యాన్స్. చిన్నారులు వైఎస్ జగన్ పై చూపిస్తున్న ప్రేమను వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అవి క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. కొంతమంది వీటిపై రాజకీయాలు చేయాలని చూస్తుండగా దానికి వైసీపీ సోషల్ మీడియా గట్టిగా నే సమాధానాలు ఇస్తూ జగన్ పై పిల్లల ప్రేమను ప్రజలకు తెలియచేస్తోంది.




















