అన్వేషించండి

Tirumala News: శ్రీవారు కొలువైన తిరుమలకు క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా ? ఈసారి వెళ్తే తప్పక సందర్శంచండి

Tirumala News: తిరుమల శ్రీవారు కొలువైన క్షేత్రానికి క్షేత్రపాలకుడు రుద్రుడు అని మీకు తెలుసా.. విష్ణువు, శివుడు ఇద్దరు ఒక్కటే అనడానికి తత్వం ఇది. ఈసారి తిరుమల యాత్రలో తప్పక దర్శించండి.

Tirumala News: గోవింద అంటే పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు.. సప్తగిరుల్లో వెలసిన గోవిందుడి... ఇలా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తులు అనేక నామాలతో కొలుస్తారు. సప్తగిరిల పై వెలసిన వెంకటాచల క్షేత్రానికి క్షేత్రపాలకుడు మాత్రం రుద్రుడు(శివుడు). నేటికి నిత్య నివేదనలు, పూజలు అందుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా తిరుమల క్షేత్ర పాలకుడైన శివుడి గురించి మీరు తెలుసుకోండి..!

తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపం ఆవరణలో బలిపీఠానికి ఈశాన్యమూలన బలిపీఠం వంటి ఆకారంలో 1 1/2 అడుగుల చిన్న శిలపీఠం ఉంటుంది.  దీనిని క్షేత్రపాలక శిల అంటారు. పూర్వం ఈ శిల రుద్రుని పూర్ణాంశతో ప్రకాశిస్తూ తిరుమల గుడి చుట్టూ తిరుగుతూ కాపలకాస్తూ ఉండేది. ప్రతి రోజూ రాత్రి అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడి తాళాలు ఈ శిల పై పెట్టి నమస్కారం చేసి వెళ్ళేవారు.. మళ్లీ తెల్లవారుజామున వచ్చి నమస్కారం చేసి తాళాలు తీసుకునేవారు. ఇలా కొనసాగుతుండగా రాత్రి ఆలయం చుట్టూ తిరిగే క్రమంలో బాలుడు శిల కింద పడి మరణించాడని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిల ను గోగర్భం తీర్థం (పాండవ తీర్థం) వద్ద కు తరలించారని, అందులోని చిన్న భాగం నేటికి తిరుమల బలిపీఠానికి దగ్గరలో క్షేత్రపాలక శిల అని అనేక పుస్తకాల్లో ప్రచురించారు.

నేటికి కొనసాగుతున్న ఆనవాయితీ

తిరుమలలో ప్రతి రోజూ రాత్రి గుడి మూసిన తరువాత ఆలయం లోని క్షేత్రపాలక శిల కు గుడి తాళాలు తాకించి నమస్కారం చేసి వెళ్తారు.. తిరిగి వచ్చిన తరువాత కూడా శిలకు తాళాలు తాకించి నమస్కారం చేసి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇది ప్రతి రోజూ జరిగే ఆనవాయితీ.

కపిలేశ్వరస్వామి వారే క్షేత్రపాలకుడు

తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడైన రుద్రుడు వేంకటాచల క్షేత్ర మూలంలో శ్రీ కపిలేశ్వరమహాలింగం రూపంలో ఆవిర్భవించింది. అదే శేషాచలం కొండలు దిగువున నిత్యం జాలువారే జలపాతం తో కొలువైన కపిలతీర్థం. యుగ యుగాల్లో తనను సేవించే వారికి అనుగ్రహిస్తున్నాడు.

మహాశివరాత్రికి అభిషేకం
ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా పాండవ తీర్థం లోని క్షేత్రపాలక శిలపై కొలువైన ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ప్రకృతి సోయగాల నడుమ... ఆహ్లాదకర వాతావరణంలో నీటి ప్రవాహాలతో... సాధువుల యోగ ముద్రలో... నిశబ్థ ప్రాంతంలో రుద్రుడు దర్శనం చేసుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారి ఆలయం నుండి అర్చకులు, ఆలయ అధికారులు, యాత్రికులకు మంగళవాయిద్యాలతో పాండవతీర్థానికి చేరుకుంటారు. అక్కడ ఏకాదశ రుద్రం తో ఉన్న కేత్రపాలకుడు అయిన రుద్రుడి కి అభిషేకం నిర్వహిస్తారు.

అనంతరం ఆ గుండునకు వెండినామాలు (ఊర్ద్వవుండ్రాలు) కండ్లు అతికించి పుష్పాలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. రుద్రునకు ఆరగింపు అయిన వడపప్పు, పండ్లు, తాంబూలంను భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ సారి తిరుమల యాత్రలో తిరుమల క్షేత్రపాలకుడిని మీరు తప్పక దర్శించండి. ప్రతి సోమవారం, ప్రత్యేక రోజుల్లో సైతం రుద్రుడి కి స్థానికులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తుంటారు.

Also Read: Maha Shivaratri Upavasam : మహా శివరాత్రి ఉపవాస నియమాలు.. ఉపవాసం అంటే అర్థమదే, దోషం లేకుండా ఎలా చేయాలో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget