Kaavaalaa Song: ‘కావాలా’ పాటకు కొరియన్ కుర్రాళ్ల స్టెప్పులు, నెటిజన్లను ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో
‘కావాలా’ పాటకు కొరియన్ అబ్బాయిలు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో 15 మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీ చూస్తుంటే ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
ఈరోజుల్లో ఇండియన్ సినిమా అనేది ప్రపంచ సరిహద్దులు దాటి ఎక్కడెక్కడికో వెళ్లిపోతోంది. ఒకప్పుడు పాన్ ఇండియా చిత్రంగా పేరు తెచ్చుకుంటే చాలు అని ఎన్నో రీజియనల్ భాషా చిత్రాలు ఆశపడేవి. ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం ఏంటి..? ఏకంగా పాన్ వరల్డ్‌నే టార్గెట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నారు మేకర్స్. ఇక రీజియనల్ భాషల్లో తెరకెక్కిన కొన్ని చిత్రాలు కూడా ఈ ఇమేజ్‌కు కారణమవుతున్నాయి. తాజాగా రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ కొరియా వరకు వెళ్లింది. ముఖ్యంగా అందులో ‘కావాలా’ పాటకు కొరియన్ అబ్బాయిలు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో 15 మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీ చూస్తుంటే ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
నెగిటివ్ నుండి పాజిటివ్‌కు..
రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన ‘జైలర్’ సినిమాకు ముందు నుండే హైప్ క్రియేట్ అయ్యింది. ఆ హైప్‌ను పెంచడం కోసం ముందుగా ఇందులోని నుండి ‘కావాలా’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ విడుదలయిన వెంటనే అనిరుధ్ ఏంటి ఇలాంటి మ్యూజిక్ ఇచ్చాడు, తమన్నా ఏంటి ఇలా ఉంది అంటూ ప్రేక్షకులు చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ ఆ పాటనే మళ్లీ మళ్లీ వింటూ మెల్లగా దానికి వ్యూస్ పెంచడం మొదలుపెట్టారు. ఇక ‘కావాలా’ పాట ప్రమోషన్ కోసం తమన్నా కూడా ప్రతీ రాష్ట్రానికి వెళ్తూ స్టెప్పులేసింది. సోషల్ మీడియాలోని స్మాల్ సైజ్ సెలబ్రిటీలతో పాటు ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ పాటకు స్టెప్పులేస్తూ.. ‘కావాలా’ను మరింత ఫేమస్ చేశారు.
కొరియన్ అబ్బాయిల పరిస్థితి ఇది..
రజినీకాంత్‌కు ముందు నుండే ప్రపంచదేశాల్లో విపరీతమైన పాపులారిటీ ఉంది. జపాన్, చైనా, కొరియా లాంటి దేశాలకు చెందినవారు రజినీకి అభిమానులుగా ఉన్నారు. తాజాగా ‘జైలర్’ రిలీజ్ సందర్భంగా ఒక జపాన్‌కు చెందిన జంట.. తమిళనాడు రావడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే ఇప్పుడు కొరియాకు చెందిన కొందరు అబ్బాయిలు ‘కావాలా’ పాటకు క్యూట్‌గా స్టెప్పులేశారు. ‘సౌత్ ఇండియన్ సినిమాలు చూసిన తర్వాత కొరియన్ బాయ్స్ పరిస్థితి ఇది’ అంటూ ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ‘కావాలా’ పాటకు కేవలం స్టెప్పులేయడం మాత్రమే కాకుండా భాష రాకపోయినా వీరంతా కరెక్ట్‌గా లిప్ సింక్ కూడా ఇవ్వడం చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు తెగ ఇంప్రెస్ అయిపోతున్నారు.
View this post on Instagram
అప్పుడు ‘సామి’.. ఇప్పుడు ‘కావాలా’..
కొరియన్ అబ్బాయిలు ‘కావాలా’ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇంకా మూవీ టీమ్ వరకు వెళ్లలేదు కానీ.. ఒకవేళ వెళ్తే మాత్రం వారు కూడా కచ్చితంగా రియాక్ట్ అవుతారంటూ నెటిజన్లు భావిస్తున్నారు. ఇంతకు ముందు కూడా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా నుండి సామి సామి అనే పాట సరిహద్దులు దాటి విపరీతంగా పాపులారిటీ పొందింది. దేశ, భాషతో సంబంధం లేకుండా చాలామంది సామి పాటకు స్టెప్పులేశారు. ఇప్పుడు ‘కావాలా’ పాటకు వస్తున్న పాపులారిటీ చూస్తుంటే సామి పాట పాపులారిటీని తలపిస్తుందని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.
Also Read: షారుఖ్ ఖాన్ కోసం తన రూల్స్‌ను పక్కన పెట్టిన నయన్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial