Kalki 2898 AD Japan Release Date : జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కీ 2898 AD.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
Kalki 2898 AD : బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆ క్రేజ్‌తోనే ఇప్పుడు జపాన్‌లో కల్కీ 2898 ఏడీ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Kalki 2898 AD to Release in Japan : రియల్ పాన్ ఇండియా హీరో అంటే మన రెబల్ స్టారే. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు అతను ఏ సినిమాలు చేసినా.. వాటికి దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్, బజ్ వచ్చేస్తుంది. ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ కల్కి 2898 AD సినిమాకు కూడా ఆ క్రేజ్ సొంతమైంది. ప్రస్తుతం ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అఫీషయల్ డేట్ కూడా ఇచ్చేశారు.
విడుదల తేది ఇదే..
ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కించిన చిత్రం కల్కి 2898 ఏడి. తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ప్రస్తుతం జపాన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. జపాన్ పరిశ్రమ దిగ్గజం కబాటా కైజో ఆధ్వర్యంలో ఈ సినిమాను 2025, జనవరి 3వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. కల్కి 2898 AD గ్లోబల్ జర్నీలో ఇదొక మైలురాయిగా మారనుంది.
భారీ కలెక్షన్లతో..
ప్రభాస్ ఫ్యాన్ బేస్‌తో, స్టోరిలోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఇప్పటికే కల్కి 2898 AD సినిమా ఎన్నో మైలు రాళ్లు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి.. 2024లో అత్యధిక వసూళ్లు చేసిన ఇండియన్ సినిమాగా గుర్తింపు దక్కించుకుంది. మహాభారతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. విమర్శకులు ప్రశంసలు అందుకునేలా నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ముఖ్యంగా కథ అందరికీ మంచి ఇంట్రెస్ట్‌ని కలిగించింది.
భారీ తారాగణంతో..
ఈ సినిమాకు ప్రధాన అట్రాక్షన్ ప్రభాసే అయినా.. మరెందరో స్టార్ హీరోలు తమ పాత్రలతో న్యాయం చేశారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, కమలహాసన్ తమ నటనతో సినిమాను మరో మెట్టు ఎక్కించారు. దీపికా పడుకొనె, విజయ్ దేవర కొండ, రాజమౌళి.. ఇలా ఎందరో నటులు తమ పాత్రలకు పరిధిమేర నటించారు. పౌరాణిక వైభవాన్ని ఫ్యూచర్‌ని కలిపి తెరకెక్కించిన ఈ చిత్రం కిడ్స్‌ని కూడా బాగా అలరించింది. ముఖ్యంగా బుజ్జి క్యారెక్టర్ పిల్లలకు ఫేవరెట్‌గా మారింది.
భవిష్యత్‌ని.. పౌరాణికాన్ని.. సాంకేతికతతో కలిపి.. మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన కల్కి 2898 AD మరికొద్ది రోజుల్లో జపాన్ ప్రేక్షకులను అలరించనుంది. పురణాలను, ఫ్యూచర్‌ను బిలివ్ చేసే జపాన్ వారిని ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే.. ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అయినప్పుడు జపాన్ ప్రేక్షకులు ఇక్కడికి వచ్చి మరీ ఈ సినిమాను ఎక్స్పీరియన్స్ చేశారు. మరికొద్ది రోజుల్లో అక్కడే ఈ సినిమాను చూడబోతున్నారు.
కల్కీ 2 ఎప్పుడంటే..
ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా ఆ తర్వాత విడుదల కావొచ్చు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న స్పిరిట్ ప్రీ పొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సలార్-2 2026లోనే ప్రేక్షకుల మందుకు రానుంది. ఆ తర్వాతే కల్కి 2 రావొచ్చు. ఎందుకంటే కల్కీకి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు మూడేళ్లు పట్టనుందని నిర్మాతలే తెలిపారు. తర్వాత బ్రహ్మ రాక్షస, లోకేశ్ కనగరాజ్ సినిమా, హోంబలే నుంచి మరిన్ని సినిమాలు వరుసగా రానున్నాయి.