అన్వేషించండి

Disha Patani: డైరెక్టర్‌గా మారిన హాట్ బ్యూటీ - ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

దిశా పటానీ దర్శకురాలిగా మారింది అనే విషయం బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా తను అసలు ఏం డైరెక్ట్ చేస్తుంది అనే విషయాలు బయటికొచ్చాయి.

సాధారణంగా హీరోహీరోయిన్లకు నటన గురించి మాత్రమే కాకుండా సినిమాలని 24 క్రాఫ్ట్స్ అవగాహన ఉంటుంది. అందుకే ఒకప్పటి నటీనటులు సినిమాల్లో నటిస్తూ కూడా డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా వ్యవహరించేవారు. ఇప్పుడు అలా చేస్తున్నవారు చాలా తక్కువ. హీరోహీరోయిన్లు నిర్మాతలుగా మారుతున్నారు తప్పా దర్శకత్వం వహించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కానీ తాజాగా హాట్ బ్యూటీ దిశా పటానీ దర్శకురాలిగా మారింది అనే విషయం బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా తను అసలు ఏం డైరెక్ట్ చేస్తుంది అనే విషయాలు బయటికొచ్చాయి.

సినిమాల్లో ఎక్కువగా నటించినా, నటించకపోయినా ఫోటోషూట్స్, ఆఫ్ స్క్రీన్ వీడియోలు.. ఇలాంటి వాటితో కూడా హీరోయిన్లు ఎప్పుడూ తమను తాము బిజీగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో దిశా పటానీ కూడా ఒకరు. ఈ అమ్మడు ఫోటోషూట్స్ చూస్తే కుర్రాళ్ల మతిపోవాల్సిందే. పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్న దిశా.. వాటిని ప్రమోట్ చేస్తూ పోజులిచ్చి సోషల్ మీడియాలో ఆ ఫోటోలను అప్లోడ్ చేస్తే.. నిమిషాల్లోనే వేలకొద్దీ లైక్స్ వచ్చిపడతాయి. ఇక కొన్నాళ్ల వరకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేక వెనకబడిన దిశాకు మళ్లీ ఇప్పుడిప్పుడే క్రేజీ సినిమాల్లో నటించే ఛాన్సులు వచ్చాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అలా ఓవైపు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంటూనే.. దిశా దర్శకురాలిగా మారింది.

క్యూ కరూ ఫికర్..
‘క్యూ కరూ ఫికర్’ అనే ఒక పాటను దిశా పటానీ డైరెక్ట్ చేసింది. ఇది 2023 గర్ల్స్ ఆంథమ్‌గా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. వైభవ్ పానీ ఈ పాటకు సంగీతాన్ని అందించగా.. నిఖితా గాంధీ స్వరాన్ని అందించింది. వాయు ‘క్యూ కరూ ఫికర్’కు లిరిక్స్‌ను అందించాడు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన పోస్టర్ విడుదలయ్యింది. ఇందులో దిశా పటానీ బీచ్‌లో కూర్చొని చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఆగస్ట్ 16న ‘క్యూ కరూ ఫికర్’ సాంగ్ టీజర్ విడుదల కానుంది. ‘మీరు కంట్రోల్ చేయలేని విషయాలను స్వేచ్ఛగా వదిలేస్తే.. మీకు కూడా స్వేచ్ఛ దొరుకుతుంది’ అంటూ ‘క్యూ కరూ ఫికర్’ సాంగ్ గురించి తన సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది దిశా.

ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్‌లో అవకాశం..
ప్రస్తుతం ఏ హీరోయిన్ చేతిలో లేని క్రేజీ ప్రాజెక్ట్స్ దిశా చేతిలో ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ప్రతీ భాషలో ఒక పాన్ ఇండియా చిత్రంలో దిశా భాగంగా ఉంది. ముందుగా ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’లో దిశా పటానీ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ దిశాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసింది. దీంతో పాటు తమిళంలో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘కంగువా’లో కూడా దిశా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ‘కంగువా’లాంటి చిత్రంలో దిశాను హీరోయిన్‌గా తీసుకోవడం ఏంటి అని కోలీవుడ్ ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేసినా.. మూవీ టీమ్ మాత్రం దీనిపై ఏ మాత్రం కామెంట్ చేయకుండా సైలెంట్‌గా తమ సినిమాపై ఫోకస్ పెట్టింది. ఈ రెండు చిత్రాలతో పాటు ‘యోధ’ అనే హిందీ మూవీలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది దిశా పటానీ. ఇలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ చేతిలో ఉండగానే డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని దిశా నిర్ణయించుకుంది.

Also Read: చిరంజీవిని చూసి వెనక్కి తగ్గిన నాగార్జున - ఆ మూవీకి నో చెప్పిన కింగ్?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget