అన్వేషించండి

Nagarjuna: చిరంజీవిని చూసి వెనక్కి తగ్గిన నాగార్జున - ఆ మూవీకి నో చెప్పిన కింగ్?

తాజాగా విడుదలయిన ‘భోళా శంకర్’ మొదటిరోజు మొదట ఆట నుండే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఇదంతా గమనించిన ఒక సీనయర్ హీరో ఇక రీమేక్స్ జోలికి వెళ్లకూడదని స్మార్ట్‌గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారట.

రీమేక్స్ విషయంలో తెలుగు సీనియర్ హీరోలపై ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఒకసారి ఒక భాషలో సినిమా విడుదలయిన తర్వాత ఓటీటీ కారణంగా ఆ సినిమాను ఇతర భాషల ప్రేక్షకులు కూడా చూడగలుగుతున్నారు. అయినా కూడా రీమేక్ అనే పేరుతో దానిని ఇష్టం లేకపోయినా తెలుగు ప్రేక్షకుల మీద తోసేస్తున్నారు. ఒకప్పుడు తన సినిమాలతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం సృష్టించిన చిరు సైతం రీమేక్స్ బాటపట్టడంతో ఫ్యాన్స్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. తాజాగా విడుదలయిన ‘భోళా శంకర్’ మొదటిరోజు మొదట ఆట నుండే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఇదంతా గమనించిన ఒక సీనయర్ హీరో ఇక రీమేక్స్ జోలికి వెళ్లకూడదని స్మార్ట్‌గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారట.

ఫేమ్‌కు తగిన సినిమాలతోనే..
టాలీవుడ్‌లో ఇతర హీరోలతో పోలిస్తే అక్కినేని హీరో నాగార్జున చేసిన రీమేక్స్ సంఖ్య తక్కువే. కెరీర్ మొదటి నుండి అయినా తన ఫేమ్‌కు సూట్ అయ్యే కథలనే ఎక్కువగా ఎంచుకోవడానికి ఇష్టపడేవాడు నాగ్. అలా తనకు నచ్చిన కథలతో నటిస్తూ.. మన్మథుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోల కేటగిరిలో ఉన్నా కూడా తొందరపడకుండా ఇప్పటికీ తన ఫేమ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు సూట్ అయ్యే కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా రీమేక్స్ కారణంగా మెగా ఫ్యామిలీపై వస్తున్న విమర్శలు చూసి నాగ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపుగా ఫైనల్ అయిపోయిన ఒక రీమేక్‌ను ఇక చేయకూడదు అని నాగ్ ఫిక్స్ అయిపోయారట.

అప్రమత్తమైన నాగార్జున..
తాజాగా చిరంజీవి.. ప్రముఖ తమిళ చిత్రం ‘వేదాళం’ను తెలుగులో ‘భోళా శంకర్’గా తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ కూడా తమిళంలో హిట్ అయిన ‘వినోదాయ సితం’ను తెలుగులో ‘బ్రో’గా రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాలు ఆశించినంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా రీమేక్ అనే ట్యాగే వీటి ఫ్లాప్ టాక్‌కు కారణం. ఇదంతా చూసిన తర్వాత ఒక మలయాళ సినిమాను రీమేక్ చేయాలని బలంగా నిర్ణయించుకున్న నాగార్జున.. వెనక్కి తగ్గాడు. ‘పొరింజు మరియం జోస్’ అనే చిత్రాన్ని నాగ్ రీమేక్ చేస్తున్నట్టు ఇదివరకే టాక్ వినిపించింది. జోజూ జార్జ్ హీరోగా నటించిన ఈ చిత్రం.. యాక్షన్ డ్రామా జోనర్‌లో ఉంటుంది. ఈ కథ నాగార్జునకు బాగా నచ్చడంతో రీమేక్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. కానీ ప్రస్తుతం సీనియర్ హీరోల రీమేక్స్ రిజల్ట్ చూడగానే వెనక్కి తప్పుకున్నాడు.

రీమేక్స్ వద్దు..
నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు ఆ హీరోలు ఎలా ఉండేవారు, ఎలాంటి సినిమాలు తీసేవారు అన్న విషయాన్ని మర్చిపోయి.. కేవలం రీమేక్స్ వల్ల వారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొందరు ప్రేక్షకులు. అందుకే ఇప్పటికైనా సీనియర్ హీరోలు ఒక కథను ఎంపిక చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ను రీమేక్ చేస్తున్న సమయంలో మరో రీమేక్ వద్దని ఫ్యాన్స్ ఎంతగా వేడుకున్నా వినుకుండా ‘భోళా శంకర్’ చేసి మరో డిజస్టర్‌ను మూటగట్టుకున్నాడు. నాగ్ మాత్రం అలాంటి తప్పు చేయకూడదు అని ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఒక కొత్త దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ.. నాగార్జున తన తరువాతి మూవీని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read: మళ్లీ కలిసి పనిచేస్తున్న ‘విరూపాక్ష’ టీమ్ - ఈసారి పౌరాణిక థ్రిల్లర్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
Embed widget