అన్వేషించండి

Virupaksha: మళ్లీ కలిసి పనిచేస్తున్న ‘విరూపాక్ష’ టీమ్ - ఈసారి పౌరాణిక థ్రిల్లర్!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన 'విరూపాక్ష' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా టీమ్ మళ్లీ కలిసి పని చేయనున్నట్లు ప్రకటించారు.

చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం వేచి చేసిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, 'విరూపాక్ష' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్, బాక్సాఫీస్  దగ్గర దుమ్మురేపింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 'విరూపాక్ష' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకొని, బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగించింది.   

మళ్లీ కలవనున్న డైరెక్టర్, ప్రొడ్యూసర్

తాజాగా 'విరూపాక్ష'  టీమ్ మళ్లీ కలిసి పని చేయనున్నట్లు తెలిపారు.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశాయి. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు వెల్లడించారు. వీలైనంత త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన విషయాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ మూవీలో కూడా హీరోగా సాయి ధరమ్ తేజ్ కొనసాగుతాడా? లేదా మరో హీరోను ఎంపిక చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

క్షుద్రపూజలు, చేతబడులు నేపథ్యంలో రూపొందిన 'విరూపాక్ష' సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. స్టార్ డైరక్టర్ సుకుమార్ దీనికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రవి కృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. 

'విరూపాక్ష'తో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సాయి ధరమ్ తేజ్

'రేయ్' సినిమాతో హీరోగా పరిచయమైన సాయి ధరమ్ తేజ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్ట పడుతూ వచ్చాడు. పలు చిత్రాలతో ఫర్వాలేదు అనిపించినా,  బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపిన సందర్భాలు లేవు. చాలా కాలం తర్వాత ఇన్నాళ్ళకు 'విరూపాక్ష' చిత్రంతో 100 కోట్ల హీరో అనిపించుకున్నాడు.  టైర్-2 హీరోలలో ఇప్పటి వరకూ మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, నిఖిల్ సిద్దార్థ, వైష్ణవ్ తేజ్ మాత్రమే సోలోగా 100 కోట్ల క్లబ్ లో చేరారు. సాయి ధరమ్ తేజ్ కూడా ‘విరూపాక్ష’తో ఆ లిస్టులో చేరిపోయాడు. జూబ్లీహిట్స్ కేబుల్ బ్రిడ్జి మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన సాయి ధరమ్ తేజ్, ఈ చిత్రంలో ఫుల్ జోష్ లోకి వచ్చారు. రీసెంట్ గా తన మేనమామ పవన్ కల్యణ్ తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది.

Read Also: ‘టైటానిక్’లో కేట్ విన్స్‌లెట్ ధరించిన ఓవర్ కోటు వేలం - ధర తెలిస్తే షాకవుతారు

టాప్ హెడ్ లైన్స్

Jagadatri Serial Today october 22: మురళిని పట్టుకుని దివ్యాంకకు  బుద్ధి చెప్పిన జగధాత్రి..కేదార్‌ గురించి పార్టీలో కమలాకర్ చెప్పకుండా అడ్డుపడిన యువరాజు
జగధాత్రి : మురళిని పట్టుకుని దివ్యాంకకు  బుద్ధి చెప్పిన జగధాత్రి..కేదార్‌ గురించి పార్టీలో కమలాకర్ చెప్పకుండా అడ్డుపడిన యువరాజు
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - బోల్డ్ మూవీ To సస్పెన్స్ థ్రిల్లర్స్... ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - బోల్డ్ మూవీ To సస్పెన్స్ థ్రిల్లర్స్... ఒకే రోజు 10 సినిమాలు స్ట్రీమింగ్
Super Thriller Series OTT : ఫోన్‌లో ఫ్యూచర్ ముందే తెలిస్తే? - ఓటీటీలో మెగా డాటర్ సూపర్ థ్రిల్లర్ సిరీస్... 7 భాషల్లో స్ట్రీమింగ్
ఫోన్‌లో ఫ్యూచర్ ముందే తెలిస్తే? - ఓటీటీలో మెగా డాటర్ సూపర్ థ్రిల్లర్ సిరీస్... 7 భాషల్లో స్ట్రీమింగ్
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget