అన్వేషించండి

Jigarthanda Double X : ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీని చూడనున్న హాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్, ఎందుకంటే..

Jigarthanda Double X : కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన 'జిగర్ తండా డబుల్ ఎక్స్' సినిమాని హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్లింట్ ఈస్ట్ వుడ్ చూడబోతున్నట్లు సమాచారం.

Jigarthanda Double X : కోలీవుడ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ లో కార్తీక్ సుబ్బరాజ్ ఒకరు. తన మేకింగ్, విజువల్ ఎక్స్పీరియన్స్ తో ఆడియన్స్ ని కొత్త ప్రపంచానికి తీసుకెళ్తారు. తన సినిమాల్లో రెడ్ అండ్ బ్లాక్ ఎక్కువగా వాడుతూ ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతి ఇచ్చే ఈ డైరెక్టర్.. పిజ్జా, జిగర్ తండా, పేట సినిమాలతో కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక పిజ్జా, పేట వంటి సినిమాలు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

కార్తీక్ సుబ్బరాజ్ ఇటీవల రాఘవ లారెన్స్, ఎస్. జె సూర్య ప్రధాన పాత్రలతో 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా ఈ మూవీ థియేటర్స్ లో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగులో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో కార్తీక్ సుబ్బరాజు మేకింగ్, సినిమాటోగ్రఫీ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి.

కార్తీక్ సుబ్బరాజ్ హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్, నటుడు, నిర్మాత.. ఆస్కార్ విన్నర్ క్లింట్ ఈస్ట్ వుడ్ కి చాలా పెద్ద ఫ్యాన్. అందుకే ఆయనకి ట్రిబ్యుట్ ఇస్తూ ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీలో కొన్ని సన్నివేశాలను పెట్టాడు. సినిమాని చూసిన మూవీ లవర్స్ సోషల్ మీడియాలో క్లింట్ ఈస్ట్ వుడ్ ని టాగ్ చేసి.. ‘‘ఇండియా మీకు ట్రిబ్యూట్ ఇస్తూ మంచి సినిమాను తీశారు. మీరు వీలైతే ‘జిగర తాండ డబుల్ ఎక్స్’ సినిమా చూడండి’’ అంటూ వరుస ట్వీట్స్ చేశారు. ఇక ఈ ట్వీట్స్ క్లింట్ ఈస్ట్ వుడ్ వరకు వెళ్లడంతో ఆయన టీం దీనిపై రెస్పాండ్ అయ్యారు. "ప్రస్తుతం క్లింట్ ఈస్ట్ వుడ్.. ఆయన డైరెక్ట్ చేస్తున్న ‘జ్యురర్ 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ గురించి క్లింట్ ఈస్ట్ వుడ్‌కు తెలుసు. షూటింగ్ నుంచి ఫ్రీ అయ్యాక కచ్చితంగా సినిమా చూస్తారు" అంటూ క్లింట్ ఈస్ట్ వుడ్ టీం రిప్లై ఇచ్చింది.

క్లింట్ వుడ్ టీమ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కార్తీక్ సుబ్బరాజ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. తనకు చాలా హ్యాపీగా ఉందని, లెజెండ్ క్లింట్ ఈస్ట్ వుడ్ తన డబుల్ ఎక్స్ సినిమాని త్వరలోనే చూడబోతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఆయనకున్న లక్షలాది అభిమానుల తరఫున ఈ సినిమాని నేను హార్ట్ ఫుల్ గా డెడికేట్ చేస్తున్నాను. సినిమా చూసి ఆయన ఏమంటారో వినడానికి వినేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు కార్తీక్ సుబ్బరాజ్.

Also Read : ఇష్టం లేకపోతే చూడకండి, ‘యానిమల్’ విమర్శలపై త్రిప్తి దిమ్రి ఘాటు వ్యాఖ్యలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Tamannaah Bhatia: అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
Rahul Dravid: ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
Embed widget