Vaishnavi Chaitanya: బేబీ క్రేజ్ బావుందమ్మా... రెండు తమిళ్ సినిమాల్లో వైష్ణవి చైతన్యకు ఛాన్స్
Vaishnavi Chaitanya New Movies: టాలెంట్ ఉంటే తెలుగు అమ్మాయిలను కూడా ఇండస్ట్రీ తప్పకుండా గుర్తిస్తుందని చెప్పడానికి వైష్ణవి చైతన్య లేటెస్ట్ ఎగ్జాంపుల్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలూ ఆవిడ చేస్తోంది
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) అంటే ఒకప్పుడు యూట్యూబర్ అనేవారు. కానీ, ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఒక్క సినిమాయే చేసి ఉండొచ్చు. అయితే, ఆమె క్రేజ్ ఇప్పుడు ఇతర సినిమా ఇండస్ట్రీలకూ వెళ్లింది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు... తమిళ్, కన్నడ నుంచి ఆవిడకు అవకాశాలు వస్తున్నాయి. తన క్యారెక్టర్, కంటెంట్ బావున్న సినిమాలకు ఈ అమ్మాయి ఓకే చెబుతోందని తెలిసింది.
తమిళ్ నుంచి వైష్ణవికి రెండు సినిమాలు!
టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకు సినిమా ఇండస్ట్రీలో తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పడానికి వైష్ణవి చైతన్య లేటెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ అమ్మాయి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. 'లవ్ ఇన్ 143 అవర్స్', 'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్', 'అరెరె మానస', 'మిస్సమ్మ' వంటివి చేసింది. ఆవిడకు ఆ షార్ట్ ఫిల్మ్స్ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. యూత్‌లో మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు సినిమాల్లో క్యారెక్టర్లు కూడా చేయడం మొదలు పెట్టింది.
'అల వైకుంఠపురములో' అల్లు అర్జున్ సిస్టర్ రోల్ చేసింది. తమిళంలో హీరో అజిత్ సినిమాలోనూ నటించారు. అయితే... సాయి రాజేష్ దర్శకత్వం వహించిన 'బేబీ'తో వైష్ణవి చైతన్య కెరీర్ టర్న్ అయ్యింది. ఈ అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ అని కన్ఫర్మ్ అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన 'బేబీ' బాక్స్ ఆఫీస్ బరిలో ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 'బేబీ' విజయంలో వైష్ణవి చైతన్యది కీలక పాత్ర. అందుకే, ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది.
Vaishnavi Chaitanya Tamil Movies: వైష్ణవి చైతన్యకు ఇప్పుడు తమిళ్, కన్నడ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ రెండు తమిళ్ ప్రాజెక్టులకు ఆవిడ సంతకం చేసినట్టు తెలిసింది. అలాగే, ఓ కన్నడ సినిమా కూడా ఉందట.
Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డతో 'జాక్' సినిమా!
Vaishnavi Chaitanya Upcoming Telugu Movie - Jack: 'బేబీ' తర్వాత వచ్చిన ప్రతి సినిమా చేసి తన క్రేజ్ క్యాష్ చేసుకోవాలని వైష్ణవి చైతన్య చూడటం లేదు. కథ, సినిమాల ఎంపికతో ఆచితూచి అడుగులు వేస్తోంది. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సరసన 'జాక్'లో నటిస్తోంది. అందులో ఆమెది ముస్లిం అమ్మాయి పాత్ర. తెలుగులో రెండు సినిమాల చర్చల దశలో ఉన్నాయట. సంక్రాంతి సందర్భంగా ఆవిడ చక్కగా చీరలో ఫోటోలు షేర్ చేశారు. వాటిని చూడండి.
Also Read: ‘గేమ్ చేంజర్’ రిజల్ట్‌పై రామ్ చరణ్ రియాక్షన్... మెగా ఫ్యాన్స్, రివ్యూయర్లు ఏమంటారో చూడాలి
View this post on Instagram