అన్వేషించండి

AP Movies : టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ధియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి !

ఏపీ ప్రభుత్వం సినిమా ధియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటి వరకూ యాభై శాతానికే అనుమతి ఉంది. అమల్లో ఉన్న కర్ఫ్యూ నిబంధనలను సడలించింది.


ఆంధ్రప్రదేశ్ సినిమా ధియేటర్ల వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రోజుకు మూడు షోలు.. యాభై శాతం ఆక్యుపెన్సీకే పర్మిషన్ ఉండేది. అయితే కొత్తగా కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారు జాము ఐదు గంటల వరకే కర్ఫ్యూ ఉంటుంది. ఈ సమయంలో  అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు. ఫంక్షన్లు, సభలు, సమావేశాలు మాత్రం 250మందితో మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. 

Also Read : నరేష్ తీరుపై టాలీవుడ్ పెద్దలు గుర్రు.. మంచును ముంచుతున్నారా? ‘మా’లో నారదముని ఎవరు?

ఈ రకమైన సడలింపులు ఇస్తూ జీవో జారీ చేయడంతో  సినిమాల ప్రదర్శనకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోయినట్లయింది. నాలుగు షోలు.. వంద శాతం ఆక్యుపెన్సీతో  సినిమాలు ప్రదర్శించుకోవచ్చు. దసరా పండుగ సందర్భంగా విడుదలవుతున్న సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం రిలీఫ్ ఇవ్వనుంది. కొంత కాలంగా సినీ పరిశ్రమ పెద్దలు నాలుగు షోలు, వంద శాతం ఆక్యుపెన్సీకి చాన్సివ్వాలని కోరుతూ వస్తున్నారు. అయితే కర్ప్యూ నిబంధనలు అమలు చేస్తూండటం వల్ల ప్రత్యేకంగా సినిమాలకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కరోనా పరిస్థితులను సమీక్షించి కర్ఫ్యూ సడలింపు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఇప్పటికే అన్ని రకాల  కరోనా నిబంధనలను ఎత్తి వేశారు. 

Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల

టిక్కెట్ రేట్ల విషయంలో మాత్రం స్పష్టత లేదు. వకీల్ సాబ్ సినిమా విడుదలయినప్పుడు జారీ చేసిన జీవో ప్రకారమే టిక్కెట్ రేట్లను నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ రేట్లు గిట్టుబాటు కావని పెంచాలని నిర్మాతలు చాలా సార్లు ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం ప్రజలను దోచుకునేందుకు పర్మిషన్ ఇవ్వబోమని చెబుతోంది. ఈ కారణంగానేపెద్ద పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. 

Also Read: ‘పంచతంత్రం’ టీజర్.. ముసలి తాబేలు చెప్పే మన కథలు.. బ్రహ్మీ ఈజ్ బ్యాక్!

దసరా సీజన్ టాలీవుడ్ పరిశ్రమకు కీలకం. ఈ సీజన్‌లోనూ పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు. విడదలయ్యే మీడియా బడ్జెట్ సినిమాలకూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం కాస్త ఊరటగా భావింవచ్చు. సినిమా ధియేటర్లకు ఇచ్చిన రిలీఫ్‌కు సంబంధించి పూర్తి స్థాయి ఆదేశాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. జీవోలన్నీ పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం మానేశారు.. కొన్నింటినీ మాత్రమే విడుదల చేస్తున్నారు. కర్ఫ్యూ రిలీఫ్‌కు సంబంధించి విడుదల చేసిన జీవోల్లో సినిమాల ప్రస్తావన లేదు. 

Also Read : ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ to ‘గనీ’.. అన్నీ ahaలోనే అట.. థియేటర్లో విడుదలకు ముందే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget