అన్వేషించండి

Jayaram in SSMB28 : మహేష్ సినిమాలో జయరామ్ - హీరో లుక్ లీక్ చేశారుగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో మలయాళ నటుడు జయరామ్ కూడా ఉన్నారు. సెట్స్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా గురూజీ త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మలయాళ నటుడు జయరామ్ (Actor Jayaram) ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు.

''థియేటర్లలో కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన కుమారుడు, గొప్ప వ్యక్తి మహేష్ బాబుతో పని చేస్తున్నాను. ఇప్పుడు మరోసారి మా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది'' అని జయరామ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన లాస్ట్ సినిమా 'అల వైకుంఠపురములో' జయరామ్ నటించారు. హీరో నిజమైన తండ్రి పాత్రలో, టబు భర్తగా కనిపించారు. ఆయనకు త్రివిక్రమ్ తన తాజా సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు.

హీరో లుక్ లీక్ చేశారుగా!
జయరామ్ సినిమాలో నటిస్తున్న విషయం చెప్పడం ఏమో గానీ... సినిమాలో హీరో లుక్ లీక్ చేశారనే అభిప్రాయం కొంత మంది అభిమానుల నుంచి వ్యక్తమైంది. 'సర్కారు వారి పాట' కోసం మహేష్ జుట్టు పెంచారు. ఈ మధ్య కొంచెం అటువంటి లుక్ మైంటైన్ చేస్తున్నారు. అదీ ఈ సినిమా కోసమే అని అందరికీ అర్థమైంది. అయితే, సెట్స్ నుంచి జయరామ్ ఫోటోలు పోస్ట్ చేయడం లుక్ ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చింది.

Also Read టామ్ క్రూజ్ సినిమాతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ? 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jayaram (@actorjayaram_official)

ఉగాదికి టైటిల్?
సినిమా టైటిల్ ఉగాదికి వెల్లడించే అవకాశాలు ఉన్నాయట. 'అయోధ్యలో అర్జునుడు', 'అతడే తన సైన్యం' వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరిగినప్పటికీ... ఆ రెండూ కాకుండా కొత్త టైటిల్ కోసం త్రివిక్రమ్ అన్వేషణ చేస్తున్నారట. 

Also Read సిద్ధూతో ప్రేమ - అసలు అదితి చిక్కదు దొరకదు

'అతడు', 'ఖలేజా' తర్వాత... సుమారు పదమూడు ఏళ్ళ విరామం తర్వాత మహేష్ బాబు హీరోగా గురూజీ త్రివిక్రమ్ (Trivikram Srinivas) సినిమా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సినిమా గురించి అనౌన్స్ చేశారు. చిన్న షెడ్యూల్ చేశారు. అయితే, పూర్తి స్థాయిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది మాత్రం 2023లోనే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఏప్రిల్ నెలాఖరుకు పాటలు, ఒక ఫైట్ మినహా మిగతా టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసేలా షూటింగ్ చేస్తున్నారట. త్రివిక్రమ్ పక్కా ప్లానింగుతో ముందుకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో నాలుగు నెలల్లో మహేష్ సినిమా పూర్తైన దాఖలాలు లేవు. పూరి జగన్నాథ్ ఒక్కరే 'బిజినెస్ మేన్' సినిమాను చకచకా తీశారు. 

కండలు చూపించిన మహేష్!
ఇటీవల సోషల్ మీడియాలో మహేష్ బాబు రెండు ఫోటోలు పోస్ట్ చేశారు. ఆ రెండు చూస్తే... ఒక విషయం క్లారిటీగా కనబడుతుంది. ఆయన బైసెప్స్. స్లీవ్ లెస్ టీ షర్టులో మహేష్ కండలు చూపిస్తూ కనిపించారు. అయితే, ఈ కండలు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న తాజా సినిమా కోసమా? ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోయే పాన్ ఇండియా / వరల్డ్ సినిమా కోసమా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మహర్షి' తర్వాత మరోసారి మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో మరో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
IPL 2025:శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Earth Quake Updates: భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
Embed widget