News
News
X

Aditi Rao Hydari : సిద్ధూతో ప్రేమ - అసలు అదితి చిక్కదు దొరకదు

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నారని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రేమ విషయంలో అదితి రావు హైదరి పాత్రలో పెదవి విప్పడం లేదు.

FOLLOW US: 
Share:

సావిత్రికి యమ ధర్మరాజు ఓ వరం ఇచ్చారు. పతి ప్రాణంబు తప్ప ఏదైనా సరే కోరుకోమని! అదితి రావు హైదరి (Aditi Rao Hydari) కూడా అంతే! హీరో సిద్ధార్థ్ (Siddharth) గురించి, వ్యక్తిగత జీవితంలో ప్రేమకు సంబంధించిన విషయాలు తప్ప వేరే ఏ టాపిక్ గురించి అడిగినా సరే ప్రశ్నలు వేసినా సమాధానాలు చెబుతా అన్నట్లుంది ఆమె వ్యవహారం.

ఇటీవల విడుదలైన 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'తాజ్ : డివైడెడ్ బై బ్లడ్'తో (Taj Divided By Blood) అదితి రావు హైదరి (Aditi Rao Hydari) ఓటీటీకి పరిచయం అయ్యారు. అందులో అనార్కలి పాత్ర పోషించారు. వెబ్ సిరీస్, ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'తాజ్' వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం అదితి రావు హైదరి హైదరాబాద్ వచ్చారు. సహజంగానే వెబ్ సిరీస్, ఓటీటీ ప్రమోషన్స్ అంటే వేరే ప్రశ్నలు అడగనివ్వరు. ఇక, లవ్ మ్యాటర్స్ తీస్తే ఎందుకు ఊరుకుంటారు? అయితే, ఇన్ డైరెక్టుగా సిద్ధూతో ప్రేమ వ్యవహారం, రీసెంట్ రీల్ గురించి అదితిని మీడియా ప్రశ్నించింది. సిద్ధూ పేరు తీయకుండా ఆమె కూడా సమాధానాలు ఇచ్చింది.
 
పర్సనల్ అంటే పర్సనల్ కదా!
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ 'హీరామండీ', ఆయన శిష్యుడు విక్రమాదిత్య మోత్వానీ తెరకెక్కించిన 'జూబ్లీ' వెబ్ సిరీస్ చేస్తున్నారు అదితి రావు హైదరి. 'తాజ్'తో పాటు ఆ కబుర్లు అన్నీ చెప్పారు. యాక్టింగ్ కబుర్లు కాకుండా వ్యక్తిగత జీవితంలో గుడ్ న్యూస్ ఏమైనా చెబుతున్నారా? అని అడిగితే... ''పర్సనల్ అంటే పర్సనల్ కదా!'' అని తెలివిగా సమాధానం ఇచ్చారు. అయితే, సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపించడం సహజమని, అది తనకు పెద్ద ఇబ్బంది కలిగించడం లేదని అదితి రావు హైదరి పేర్కొన్నారు. మెజారిటీ ప్రేక్షకులు చూపించే ప్రేమ ముందు కొన్ని కామెంట్స్ పట్టించుకోనని చెప్పారు.

సిద్ధూతో రీసెంట్ రీల్...
త్వరగా ప్యాకప్ కావడంతో!
ఇటీవల సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఓ రీల్ చేశారు. అందులో పెళ్లి పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ రీల్ ప్రస్తావన తీసుకురాగా... ''నేను హ్యాపీగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తా. ఆ రోజు త్వరగా ప్యాకప్ అయ్యింది. ఏడు గంటలకు షూటింగ్ క్లోజ్ అయ్యింది. అందుకే, డ్యాన్స్ చేశా'' అని అదిరి రావు హైదరి చెప్పారు. అన్నట్లు... తనకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందని తెలిపారు.

Also Read : టామ్ క్రూజ్ సినిమాతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ?

'మహా సముద్రం'లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి, శర్వానంద్ నటించారు. ఆ సినిమా సమయంలో మొదలైన సిద్ధూ, అదితి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని ఫిల్మ్ నగర్ టాక్. సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి వ్యవహార శైలి చూసినా సరే ఆ విషయం తెలుస్తూ ఉంటుంది. శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా ఇద్దరూ జంటగా వచ్చారు. ఆ తర్వాత రీల్ చేశారు. దాంతో జనాలకు మరింత క్లారిటీ వచ్చింది. వాళ్ళు ప్రేమలో ఉన్నారని! అయితే, ఆ మాట వాళ్ళు చెప్పడం లేదు.  

Also Read : విశ్వక్ సేన్ నాకంటే ఎక్కువ వాగుతాడు, నేనే సైలెంట్ అయిపోయా - ఎన్టీఆర్

Published at : 18 Mar 2023 12:24 PM (IST) Tags: Siddharth Aditi Rao Hydari Taj Divided by Blood Aditi On Siddharth

సంబంధిత కథనాలు

Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!

Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా

Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి